తెలంగాణ

ప్రభుత్వ చర్యపై రాష్టప్రతికి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ అమర వీరుల స్పూర్తి యాత్ర నిర్వహించకుండా అడ్డుకుని, తమను అరెస్టు చేయడాన్ని రాష్ట్ర గవర్నర్‌కు, రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తామని, కోర్టుకూ వెళతామని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. వరంగల్, జనగాంలో నిర్వహించబోయే 6వ విడత అమర వీరుల స్పూర్తి యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఈ నెల 5వ తేదీనే పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు ప్రొఫెసర్ కోదండరామ్ ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. యాత్రకు ముందు రోజు రాత్రే టి.జెఎసి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని ఆయన తెలిపారు. వరంగల్‌లో 300 మంది, హైదరాబాద్‌లో 110 మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. శనివారం ఉదయం తాను హోం మంత్రిని కలిసి యాత్రకు అనుమతించాల్సిందిగా కోరినా, ఫలితం లేదన్నారు. తనను ఘట్‌కేసర్‌కు సమీపంలోని జోడిమెట్ల వద్ద అరెస్టు చేశారని, పోలీసులు యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్‌లో వచ్చారని ఆయన తెలిపారు. పైగా సెక్షన్ 151 కింద అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. అత్యాచారాలు వంటి కాగ్నిజబుల్ నేరాలు జరిగినప్పుడే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారని ఆయన చెప్పారు.
ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహారిస్తున్నదని ఆయన విమర్శించారు. తమ పట్ల ప్రభుత్వం వ్యవహారించిన తీరు గురించి అన్ని పార్టీల నేతలనూ కలిసి వివరించనున్నట్లు ఆయన తెలిపారు.