తెలంగాణ

అధికారులు హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందు వల్ల విద్యుత్ శాఖ అధికారులందరూ తమ కార్యస్ధలంలోనే ఉండి విధులు నిర్వహించాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విద్యుత్ సరఫరా కొనసాగించాలని రాష్ట్ర జెనో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు విద్యుత్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కొంత మంది విద్యుత్ అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీరు అప్రమత్తంగా ఉండి ఇతర ఉద్యోగులతో సమన్వయంగా పనిచేయాలని ఆయన హెచ్చరించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎవరే పనిచేస్తున్నారో రిజిస్టర్‌లో రాయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించమన్నారు. రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎక్కడా పెద్దగా అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా అందిస్తున్నందుకు అధికారులను అభినందించారు. విధులు నిర్వహించే సందర్భంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆదివారం ఇక్కడ డిప్లమో ఇంజనీర్ల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడి రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నారన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజలకు పెద్దగా అసౌకర్యం కలిగించకుండా సరఫరా చేస్తున్నారన్నారు. వర్షాకాలం వచ్చే ముందు అన్ని లైన్లను చెక్ చేయడం, లూజ్ జంపర్లను సరిచేయడం, పాత కండక్టర్లను మార్చడం, చెట్ల కొమ్మలను నరకడం లాంటి చర్యల ఫలితంగా విద్యుత్ సరఫరాను సక్రమంగా చేశారన్నారు. కాంట్రాక్టు వర్కర్లకు కూడా విద్యుత్ శాఖ నేరుగా వేతనాలు చెల్లిస్తున్నదన్నారు. ప్రజల నుంచి వచ్చిన అన్ని ఫోన్ కాల్స్ స్వీకరించి వారు చెప్పే సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు తరచుగా విఫలం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సంస్ధాగతంగా పనితీరు మెరుగుపరచడంతో పాటుగా సంస్ధకు ఎదురయ్యే ఆర్ధిక నష్టాలను అరికట్టేందుకు ఉద్యోగులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్లమో ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు బిసి రెడ్డి, పూర్వ అధ్యక్షఉడు మధుసూదన్ రెడ్డి, నాయకుడు గోవర్ధన్ రెడ్డి, దాదాపు 600 మంది ఇంజనీర్లు పాల్గొన్నారు.