తెలంగాణ

గోదావరిలో ముగ్గురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 15: కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు గోదావరి స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు క్షేమంగా బయటపడ్డాడు. యువకుల మృతితో కుటుంబ సభ్యులు శోకసం ద్రంలో మునిగిపోయారు. మంచిర్యాల రూరల్ సిఐ ప్రమోద్‌రావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీకి చెందిన మంద అఖిల్ పెద్దనాన్న దినకర్మ అనంతరం అతని కుటుంబ సభ్యులు మొగలితో పాటు సోదరుడు అనిల్, వారి స్నేహితులు మిట్టపల్లి వేణు, అసంపల్లి మహేష్ గోదావరి స్నానానికి వెళ్ల్లారు. స్నానం ముగించుకున్న కుటుంబ సభ్యులు గోదావరి నుండి బయటకు వచ్చినప్పటికీ అనిల్, అఖిల్, వేణు, మహేష్ సరదాగా కాసేపు నీటిలో ఆడుకుంటుండగా మొదట వేణు నీటిలో మునుగుతూ గట్టిగా కేకలు వేయగా అనిల్, అఖిల్, మహేష్ నీటిలోకి వెళ్లారు. నీటి ఉద్ధృతికి యువకులు బయటకు రాకపోవడాన్ని గమనించిన వారి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్న చీరను నీటికిలోకి వదలగా అఖిల్ మాత్రం చీర సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. మిగతా ముగ్గురు నీటిలోనే మునిగిపోయారు. సమాచా రం అందుకున్న హాజీపూర్ తహసిల్దార్ మోహన్‌రెడ్డి, రూరల్ సిఐ ప్రమోద్ రావు, సింగరేణి రెస్య్కూ టీం అధికారి జెగ్గారెడ్డి 12 మంది తో రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. గోదావరి వద్ద పెద్ద పెద్ద లైటింగులతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బతికి ఉన్నారా, చనిపోయారా అన్న భయం కుటుంబ సభ్యుల్లో రేకెత్తింది. పుణ్యస్నానానికి వచ్చి నీటిలో గల్లంతు కావడం అంతులేని విషాదాన్ని నింపింది.
అధికారుల నిర్లక్ష్యమే మా తమ్ముని చావుకు కారణం
*మహేష్ సోదరుడు ప్రశాంత్
గోదావరి స్నానాలు ఆచరించే ప్రాంతంలో అధికారులు రక్షణ చర్యలు చేపడితే తమ తమ్ముడు ఈ విధంగా నదిలో గల్లంతయ్యేవాడు కాదని, బాధ్యులైన అధికారులను శిక్షించాలని మృతుడు మహేష్ సోదరుడు ప్రశాంత్ డిమాండ్ చేశాడు.
గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నాం
*సిఐ ప్రమోద్ రావు, తహసీల్దార్ మోహన్‌రెడ్డి
గోదావరిలో గల్లంతయిన ముగ్గురు యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నామని, వారి ఆచూకీ లభ్యం కోసం సింగరేణి రెస్య్కూ టీం సైతంను రంగంలోకి దింపామని సిఐ ప్రమోద రావు, తహశీల్దార్ మోహన్‌రెడ్డి తెలిపారు.