తెలంగాణ

ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ వార్తలే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 15: తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969లో జరుగుతున్నప్పుడు అప్పట్లో ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ దినపత్రికలు ఉద్యమానికి ఎంతగానో సహకారం అందించాయని, వాటిలో వచ్చిన వార్తల ఆధారంగానే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ సమాచారం తెలిసేదని రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతి ధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1969 ఉద్యమ సమయంలో ఇప్పటిమాదిరిగా టివిలు, ఇన్ని పేపర్లు లేవని కేవలం ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ పత్రికలు మాత్రమే తెలంగాణ ఉద్యమ గురించి వార్తలు రాసేవని అన్నారు. ఈ రెండు పత్రికల్లో వచ్చిన వాటిని చూసి ఉద్యమాన్ని మరిం త నడిపించాలని భావించేవారమని, అప్పట్లో ఈ రెండు పత్రికలు ఉద్యమానికి అందించిన సహకారం ఇప్పటికీ తనకు గుర్తు ఉందని అన్నారు. రేడియోలో వచ్చే వార్తలతో పాటు తెలుగులో వచ్చిన ఆంధ్రభూమి పత్రిక కోసం జిల్లాలో ఎదురు చూస్తుండేవారమని హైదరాబాద్‌లో డిసి, భూమి పత్రికల కోసం క్యూలె న్లు కట్టేవారమని గుర్తు చేశారు. అలాంటి పత్రికలు అప్పుడు, ఇప్పుడు సైతం బాగానే సహకారం అందిస్తున్నాయని అన్నారు.