తెలంగాణ

మా చిత్తశుద్ధికి దిగుబడే నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, అక్టోబర్ 15: రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించే ధైర్యం ప్రతిపక్షాలకు ఎక్కడిదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్‌లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లికృష్ణారావుతో కలిసి ఆయన ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులుగా పేరు మారిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. అందుకు నిదర్శనమే జిల్లాలో పంట ల అధిక దిగుబడి అని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏ మంత్రి కూడా పంప్‌హౌస్‌ల వద్ద నిద్రించి ప్రాజెక్టుల పనితీరును పరిశీలించలేదని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. తమ ప్రభు త్వం గత సంవత్సరం పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని, ఈ సంవత్సరం 6.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందని తెలిపారు. వచ్చే సంవత్సరం వందశాతం పనులు పూర్తి చేసి నిర్దేశిత 8.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 1984 జూన్ 16వ తేదీన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగినా ఆనాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా 2003 వరకు పనుల ఊసే ఎత్తలేదని ఆయన అన్నారు. 90 శాతం పనులు పూర్తి చేశాం అని పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 50 వేల ఎకరాలకు మాత్ర మే నీళ్లు ఎందుకు ఇచ్చిందో ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కల్వకుర్తి లిప్ట్-2 ద్వారా ఒక్క చుక్కనీటిని ఎత్తిపోసిందిలేదని ఆయన అన్నారు. లిప్ట్-2 కూలిపోతే జియాలజిస్టులను తీసుకువచ్చి సాంకేతికంగా పరిశీలించి పున :ప్రారంభించడానికి సమయం పట్టిందని ఆయన గుర్తు చేశారు. 1984లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి జిఓ వస్తే 2003లో పనులను ప్రారంభించారని ఆయన ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పనులు ప్రారంభించిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు పథకం పనుల నిర్వహణ గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో నత్తనడకన సాగాయని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చన తరువాతనే పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలలో వేగం పెరిగి రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పనుల నిర్వహణకు బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు కేటాయించలేదని, కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం 650 కోట్లు ఈ సంవత్సరం వెయ్యి కోట్లు కేటాయించి పెం డింగ్ ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో చిత్తశుద్ధిని చాటుకుందని పేర్కొన్నారు. ఒక్క కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుకే టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.1200 కోట్లు బడ్జెట్ కేటాయించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. రూ.2100 కోట్లకుపైగా టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిందని ఆయన వివరించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల నిర్వహణకు ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డంకిగా మారారని ఆయన అన్నారు. పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం భూసేకరణ జరపడానికి ప్రయత్నించగా ప్రతిపక్షాలు అందుకు అడుగడుగునా అడ్డుపడి భూ సేకరణ ఆలస్యం కావడానికి కారకులయ్యారని ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ పథకం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడిందని పనుల నిర్వహణ కారణంగా జిల్లాలోని 300 చెరువుల్లో నీరు నిండిందని ఆయన వివరించారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు 90 శాతం పూర్తి చేశామని చెబుతున్నది పనులు కాదని, డబ్బులనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కల్వకుర్తి ప్రజల చిరకాలవాంఛ నేటితో తీరుతుందని తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.