తెలంగాణ

నిజాంసాగర్‌కు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, అక్టోబర్ 16: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి వరద భారీగా రావడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. సోమవారం జలాశయంలోకి 18,933 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని, ప్రాజెక్ట్ డిఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్ట్ పూర్థి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, 1398.66 అడుగుల నీరు నిల్వఉందని తెలిపారు. 17.802 టిఎంసిలకు గాను 10 టిఎంసిల నీరు నిల్వఉందని తెలిపారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలోగల సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ జలాశయం ఒక గేటు ద్వారా 8,106 క్యూసెక్కుల వరద నీరు మంజీర నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. జలవిద్యుత్ కేంద్రం టర్బైన్‌ల ద్వారా 1460 క్యూసెక్‌ల నీటిని నిజాంసాగర్‌లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 9,566 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి విడుదల చేసినట్లు తెలిపారు. సింగూర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి 11 వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్ట్ పూర్థి స్థాయి నీటి మట్టం 29.910 టిఎంసిలకు గాను 28.417 టిఎంసిల నీరు నిల్వఉందని తెలిపారు.

చిత్రం..నిజాంసాగర్ జలాశయంలో 10 టిఎంసిలకు చేరిన వరద నీరు