తెలంగాణ

ఆత్మహత్యలు జరిగితే తీవ్రమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: విద్యార్థుల ఆత్మహత్యలు జరిగితే తీవ్రమైన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను హెచ్చరించింది. కాలేజీలను ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30 వరకూ మాత్రమే నిర్వహించాలని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఇంటర్ బోర్డు అధికారులు మంగళవారం నాడు సమావేశం నిర్వహించారు. భేటీలో విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు సమావేశంలో వెలుగులోకి వచ్చాయని అన్నారు. విద్యాపరమైన ఒత్తిడి, ఇంటి వద్ద సమస్యలు, తల్లిదండ్రులు విద్యార్థుల నుండి ఎక్కువగా ఆశించడం, తోటి విద్యార్థులతో పోల్చుకోవడం వంటి అంశాలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తున్నాయని అన్నారు. అకడమిక్ షెడ్యూలు కూడా ఒక కారణమని అన్నారు. ఇంటర్ బోర్డు ఇచ్చే అకడమిక్ షెడ్యూలును అందరూ పాటించేలా చూడటంతో పాటు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేలా కృషి చేస్తామని అన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ ఇకపై కాలేజీల హాస్టళ్లను సైతం బోర్డు పరిధిలోకి తెస్తామని అన్నారు. కాలేజీల్లో సౌకర్యాలపై నిఘా ఉంటుందని, అకడమిక్ క్యాలండర్ పాటించేలా చూస్తామని అన్నారు. పిల్లల సామర్ధ్యాన్ని దాటి తల్లిదండ్రులు వారిని ఇబ్బంది పెట్టొద్దని పేర్కొన్నారు. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలని ఆయన సూచించారు.

సమావేశంలో ముఖ్యాంశాలు
* కార్పొరేట్ కాలేజీల్లో, స్కూళ్లలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవల్సిందే
* విద్యార్థులపై ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు బోధించే విధంగా కాలేజీలు, స్కూళ్ల విధానం ఉండాలి, వేళలు పాటించాలి
* ప్రభుత్వ నియమావళిని అమలుచేయని కాలేజీ యాజమాన్యాల గుర్తింపును రద్దు చేయాలి
* తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాన్ని గుర్తించి వారికి తగిన కోర్సులు, కాలేజీల్లోనే చేర్పించాలి.
* పిల్లలకు ఇష్టమైన కోర్సులు, కాలేజీల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలే తప్ప కార్పొరేట్ కాలేజీల్లో చదివించడం స్టేటస్ సింబల్‌గా భావించవద్దు.
* కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు, అంతర్జాతీయ స్కూళ్లు కూడా విద్యార్ధుల వికాసం కోసం విద్యను అందించాలి. పిల్లలకు తల్లిదండ్రులను కలుసుకునే స్వేచ్ఛను కల్పించాలి. అవసరమైతే పిల్లలను ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలి. సెలవుల్లో కూడా పిల్లలు ఇళ్లకు వెళ్లనివ్వకుండా ర్యాంకుల కోసం వారిపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు, విద్యావిధానాలు మంచివి కావు
* అన్ని కాలేజీల్లో కౌనె్సలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఈ సెంటర్లలో విద్యార్ధులకు జీవితాన్ని ఎదుర్కొని నిలిచే విధంగా, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా కౌనె్సలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ కౌనె్సలింగ్ సెంటర్లకు తల్లిదండ్రులకు కూడా అనుమతించి వారి సందేహాలను నివృత్తి చేయాలి. వారిలో ఉన్న భయాలను దూరం చేసే విధంగా కాలేజీల్లో విద్యావిధానాల గురించి, పిల్లల ప్రవర్తనా తీరు గురించి వివరించి చెప్పాలి.
* యోగ, ధ్యానం తరగతులు నిర్వహించాలి. మహిళా కాలేజీల్లో కేవలం మహిళలనే బోధకులుగా నియమించాలి.
సూచనలు విన్న అధికారులు వీటిపై మరింత చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.