తెలంగాణ

23న సైబర్ సెక్యూరిటీ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ఈ నెల 23వ తేదీన హెచ్‌ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సదస్సు జరగుతుంది. సైబర్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాన్ని చర్చిస్తారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, రాష్ట్రప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. సైబర్ నేరాలు విసురుతున్న సవాళ్లపై ఈ సదస్సులో నిపుణులతో చర్చిస్తారు.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిరామారావు పాల్గొంటారు. సైబర్ సెక్యూరిటీ సదస్సు వివరాలను కౌన్సిల్ కార్యదర్శి భరణి కె అరోల్ వివరించారు. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ నిపుణులు రోలాండ్ క్లౌటెర్, డాకగ్టర్ రుద్ర మూర్తితో పాటు వివిద దేశాలకు చెందిన సైబర్ భద్రత పరిశోధకులు పాల్గొంటారని చెప్పారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇడిగా చింతపల్లి గాయత్రి చైతన్య
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చింతపల్లి గాయత్రి చైతన్య నియమితులయ్యారు. ఆయన గతంలో సింగపూర్‌లో ఈ బ్యాంకు సిఇవోగా పనినచేశారు. 1985లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పివోగా చేరిన చైతన్య వ్యవసాయశాస్త్రంలో పిజి చేశారు. అనంతరం సిఏఐఐబి కోర్సు పూర్తి చేశారు. ఈ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసి వ్యవసాయ, వాణిజ్య, ఆర్థిక రంగంలో మంచి నైపుణ్యం సాధించి అందరి మన్ననలు పొందారు.
పవన విద్యుత్‌లో రెండవ ఎతె్తైన
మెట్ మాస్ట్‌ను నెలకొల్పిన మైట్రా
ఆసియా పసిఫిక్ రీజియన్‌లో పవన విద్యుత్‌లో రెండు ఎతె్తైన మెట్ మాస్ట్‌ను తమిళనాడులోని కాయత్తూరు, ట్యూటికార్న్ మధ్య ఏర్పాటుచేసినట్లు మైట్రా ఎనర్జీ సంస్ధ సిఇవో విక్రమ్ కైలాష్ చెప్పారు. ఈ మెట్ మాస్ట్ ఎత్తు 150 మీటర్లు. ఆరు విండ్ స్పీడఖ్ మానిటోరింగ్ స్దాయిలను ఏర్పాటు చేశారు.
పవన విద్యుత్‌లో అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ మెట్‌మాస్ట్‌ను నెలకొల్పినట్లు సిఇవో చెప్పారు. గాలి వేగం, దిశను కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందన్నారు.