తెలంగాణ

ఐదు వ్యవసాయ కమిటీల గడువు మరో ఆరు నెలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్రంలోని ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీల గడువును మరో ఆరునెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్ జిల్లా గోపాల్‌రావుపేట, భద్రాద్రి జిల్లా ఇల్లందు, రాజన్న సిర్సిల్లా జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటి, కామారెడ్డి జిల్లా గాంధారి మార్కెట్ కమిటి, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీల గడువును ఆరునెలల పాటు పొడిగించారు. ఈ ఆరు కమిటీల గడువు ఇటీవలే ముగిసింది. దాంతో మార్కెట్ కమిటీల పాలన సజావుగా సాగేందుకు వీలుగా గడువు పొడిగించారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఆరు నెలలకు మించి ఎక్కువ కాలం గడువు పెంచేందుకు వీలులేకపోవడంతో ఆరునెలల పాటు గడువు పెంచుతూ వస్తున్నారు.