తెలంగాణ

శాసనసభ 25 రోజులు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్రంలో శాసనసభ సమావేశాలను కనీసం 25 రోజుల పాటు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనేక ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ అవినీతి, రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్య, రాష్ట్రంలో పాలనా వైఫల్యం, హైదరాబాద్‌లో అధిక వర్షాలు, ప్రజల ఇబ్బందులు, శాంతి భద్రతల వైఫల్యం, రైతు సమస్యలు, ఎస్సీ, ఎస్టీ బిసి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనసభ , శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. రాష్ట్రంలో అనేక పనుల్లో అవినీతి హెచ్చుమీరిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి చెందుతుందని తాము ఆశించామని, కానీ తీరు చూస్తే రాష్ట్రంలో పరిస్థితిపై ఎన్‌ఆర్‌ఐలు కూడా భయపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. అమెరికాలో బిజెపి ప్రవాస భారత్ సమావేశాలు జరిగాయని తాను వాటిలో పాల్గొన్నానని లక్ష్మణ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నరేంద్రమోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్న సంబంధాలు దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతాయని అన్నారు. పెట్టుబడులు ఇతోధికంగా వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని, పేదరికం లేని తీవ్రవాద రహిత, కులతత్వంలేని, మతతత్వం లేని , అవినీతి రహిత , పారదర్శక పాలనను తాము కోరుకుంటున్నామని అన్నారు. అయోధ్యలో రాముని విగ్రహాన్ని ప్రతిష్టించడంపై హైదరామాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. సమావేశంలో ప్రధానకార్యదర్శి జి ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్ వి సుభాష్, కొల్లి మాధవి, మీడియా కన్వీనర్ సుధాకర్ శర్మ వజ్జ పాల్గొన్నారు.
హోం గార్డుల సమస్యలను పరిష్కరించండి
రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని చీఫ్ సెక్రటరీ ఎస్ పి సింగ్‌ను కోరినట్టు బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి తెలిపారు.