తెలంగాణ

ఆత్మవిశ్వాసం వీడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ పోటీ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థులు మేటిగా నిలవాలని బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. మంగళవారం నాడు సైదాబాద్‌లో నిర్మించిన బిసి స్టడీ సర్కిల్ నూతన భవనాన్ని మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. సివిల్స్, వివిధ పోటీ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న 200 మంది విద్యార్థులతో జోగు రామన్న ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థి జీవితంలో చదువే ఆయుధమని , అపుడే వారు రాణించగలుగుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో బిసి స్టడీ సర్కిల్స్ నిరంతరాయంగా పనిచేస్తాయని అన్నారు. పోటీ పరీక్షల షెడ్యూలుతో సంబంధం లేకుండా స్టడీ సర్కిల్స్ విద్యార్థులతో నిరంతరం పనిచేస్తాయని అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను నిష్ణాతులైన బోధకులతో శిక్షణ ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. బిసి విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఒకొక్కరికీ 20 లక్షల రూపాయిలను ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల కోసం 45వేల కోట్లను కేటాయించి అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ కుమార్, కమిషనర్ విజయకుమార్, అదనపు కార్యదర్శి సైదా, అదనపు సంచాలకుడు కె అలోక్ కుమార్, బిసి కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుండే ఆయన వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించి విద్యార్థుల బాగోగులు చూడాలని , సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను ఎప్పటికపుడు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్ధులు బాగా చదువుకుని మెరుగైన ఫలితాలను సాధించాలని పేర్కొన్నారు.