తెలంగాణ

కల్వకుర్తి ప్రాజెక్టు పురుడు పోసుకున్నప్పుడు కెసిఆర్ ఎమ్మెల్యేగా లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: కల్వకుర్తి ప్రాజెక్టు పురుడు పోసుకున్నప్పుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కనీసం ఎమ్మెల్యేగా కూడా లేరని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టు ఎవరు తీసుకుని వచ్చారో ప్రజలందరికీ తెలుసునని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడడం భావ్యం కాదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఎవరు కోర్టుకు వెళ్ళినా ఆ నెపం తమ పార్టీపై నెట్టడం సరైంది కాదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్థాయికి తాను దిగజారి మాట్లాడలేనని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నాడు టి. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పురుడు పోసుకున్నదని ఆయన తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం అప్పుడు తాను స్థానిక ఎమ్మెల్యేగా పట్టుబట్టి సాధించుకోవడం జరిగిందన్నారు. కల్వకుర్తి పథకం సాధించిన ఘనత తమదేనంటూ ఇప్పుడు కొందరు మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, విస్మయం కలిగిస్తున్నదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోతే తామే పూర్తి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో మంత్రులుగా ఉండి మాట్లాడుతున్న వారు లోగడ తాము అధికారంలో ఉన్నప్పుడూ మంత్రులుగా ఉన్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న తప్పులు ఈడి, సిబిఐకి తెలుసునని అన్నారు. అందుకే ముఖ్యమంత్రికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంటే భయం, వణుకు అని ఆయన తెలిపారు. టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అని ప్రశ్నించగా, అటువంటి సమాచారం ఏదీ తనకు లేదన్నారు. ఎవరు పార్టీలోకి రావాలో తమ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన దాట వేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని ఆయన తెలిపారు. పార్టీకి లాభం కలిగే ప్రతి అంశాన్నీ తాను సమర్థిస్తానని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్, బిజెపిలతో సంబంధం లేని ఏ పార్టీ తమతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చినా సంతోషమేనని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా ఎందుకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడం లేదని జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం పెద్ద మొత్తంలో పన్ను విధించి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. జిడిపి నష్టాలను పూడ్చుకునేందుకు, పెట్రోలు, డీజిల్‌పై వచ్చే సుంకాన్ని కేంద్రం వాడుకుంటున్నదని ఆయన విమర్శించారు. ఇంతగా ప్రజలను పీడించే ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుభవరాహిత్యం కనిపిస్తున్నదని ఆయన విమర్శించారు. తాజ్‌మహల్ మన దేశ సంస్కృతిలో భాగం కాదని యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడడం సమంజసం కాదన్నారు. దీనిపై ప్రధాని మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించాలని జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.

చిత్రం..మంగళవారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి