తెలంగాణ

అధికారంలో ఉన్నపుడు జరిగిన అవకతవకలను మరిచారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 18: కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నపుడు జరిగిన అవకతవకలను మరచి ఇప్పుడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో గురివింద గింజల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి కడియం విమర్శించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో అమలు జరిగిన జలయజ్ఞంలో వేలాది కోట్ల రూపాయలను నిస్సిగ్గుగా దోచుకున్నారని, ఈ కారణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు మరచిపోయినట్లున్నారని అన్నారు. బిచ్చగాడు తిని పారేసిన ఎంగిలి ఆకులు నాకిన మొఖాలు కాంగ్రెస్ నాయకులవని తీవ్రంగా విమర్శించారు.
ఈనెల 22న ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా పర్యటన, టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి జరిగే శంకుస్థాపన, జనసమీకరణ ఏర్పాట్లపై బుధవారం టిఆర్‌ఎస్ అర్బన్ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ హయాంలో వరంగల్ జిల్లాకు చెందిన ఒక పెద్దమనిషి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి దోపిడీకి బ్రోకర్‌లా వ్యవహరించి జిల్లాకు అపఖ్యాతి తెచ్చిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరచిపోయారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు ఇసుకదందా, బ్యాంకు నిధుల దుర్వినియోగం, యూనివర్సిటీ భూముల కబ్జా, సెటిల్మెంట్లు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తుంటే, కాంగ్రెస్, టిడిపి నాయకుల కళ్లకు అభివృద్ధి కనిపించటం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తమ పార్టీల అడ్రస్ గల్లంతు అవుతుందనే భయంతోనే కాంగ్రెస్, టిడిపిలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఇటీవల మంత్రి కెటిఆర్ వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంలో తాను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా వ్యవహరించారని టిడిపి నాయకులు చేసిన విమర్శలను కడియం తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక టిడిపికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరానని, గతంలో తాను టిడిపిలో ఉన్నపుడు, ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో ఎక్కడైనా డబ్బు తీసుకున్నట్లు, పైరవీలు చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తెలంగాణలో టిడిపి ఏమవుతుందో తెలియని పరిస్థితి ఇప్పుడు ఉందని, చంద్రబాబు నాయకత్వంలోని ప్రస్తుత టిడిపిలో జిల్లా టిడిపి నాయకులకు ఆత్మగౌరవం ఉందా, లేదా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో టిడిపి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోందని, ఆ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదని, అయినా కూడా ఆ పార్టీనాయకులు ఏ మొహం పెట్టుకుని టిఆర్‌ఎస్‌ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. విమర్శలు చేసేటపుడు ఎదుటి మనిషి గురించి ఆలోచించి మాట్లాడాలని సూచించారు. వరంగల్ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్, ఐటి హబ్‌గా మార్చేందుకు కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి తాజాగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును మంజూరు చేసారని, ఈ పార్కు నిర్మాణం పూర్తయితే 1.20లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సమావేశంలో వరంగల్ ఎంపి దయాకర్ మాట్లాడుతూ గతంలో వరంగల్ జిల్లాలో ఆజంజాహి మిల్లు, ఎయిర్‌పోర్టు ఉండేదని, కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ రెండూ ప్రస్తుతం కనుమరుగయ్యాయని, జిల్లా చరిత్ర తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆజంజాహి మిల్లు స్థానంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును మంజూరు చేసారని తెలిపారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు.