తెలంగాణ

ప్రజలే బుద్ధి చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, అక్టోబర్ 18: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్‌లు, కోదండరాంలకు ప్రజలే గుణపాఠం చెబుతారని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్‌లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందడం వారికి ఇష్టంలేదని, సిద్దిపేట జిల్లా ప్రజలను సిఎం కెసిఆర్ సంతోషపెడుతుంటే ప్రొఫెసర్ కోదండరాం జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా 74 యేళ్లుగా గోదావరి జలాలను రప్పించాలనే ధ్యాసలేని కాంగ్రెస్, టిడిపిల కథ ఇక కంచికేనని, ఉనికి కోసం పాకులాడుతున్న ఆ పార్టీలు భూస్థాపితం కాక తప్పదని హెచ్చరించారు. మల్లన్నసాగర్ అన్నదాతలకు వరప్రదాయని కానుండగా, ఈ రిజర్వాయర్ నిర్మాణంతో సిద్దిపేట జిల్లాతోపాటు యాదాద్రి, నిజామాబాద్, మేడ్చెల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ సాదన దిశగా ముందుకెల్తున్న సిఎం కెసిఆర్‌పై విమర్శలు చేస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్న వారిని ప్రజలే నిలదీయాలని, బంగారు తెలంగాణ సాధనను అడ్డుకోవడమే ప్రతిపక్షాల ఎజెండాగా ఉన్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుండగా, గజ్వేల్ నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతుందని తెలిపారు. స్ఫూర్తి యాత్ర పేరుతో ప్రజల్లో అపోహలు లేపుతూ రాద్ధాంతం చేస్తున్న కోదండరాంరెడ్డి ప్రజల ఉసురుపోసుకుంటుండగా, అన్నదాతల చావుకు ప్రతిపక్షాలే కారణమంటూ నిలదీశారు. కాగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్న వారిని ప్రజలే తరిమి కొడతారని, చచ్చిపోయిన రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టులకు వెల్తున్న కాంగ్రెస్, టిడిపి నేతలకు చుక్కెదురు కాక తప్పదని వివరించారు.