తెలంగాణ

1401 అడుగులకు చేరిన నిజాంసాగర్ నీటి మట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, అక్టోబర్ 18: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో, బుధవారం 1401.00 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో గల సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో, నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం జలకళను సంతరించుకుంది. సింగూర్‌ప్రాజెక్ట్ జలాశయంలోఎగువ ప్రాంతంనుంచి వరద రాకపోవడం వల్ల సింగూర్ ప్రాజెక్ట్ వరద గేట్లను నీటిపారుదల శాఖాధికారులు మూసివేశారు. సింగూర్ ప్రాజెక్ట్ జలవిద్యుత్ కేంద్రం గేట్ల ద్వారా 1460 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ, విద్యాత్ ఉత్పాదన చేస్తు మంజీరా ద్వారా నిజాంసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారని, నిజాంసాగర్ ప్రాజెక్ట్ డిఈఈ దత్తాత్రి తెలిపారు. సింగూర్ జలాశయంలో 8వేల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చి చేరుతోందని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 520.600 మీటర్లు కాగా, 523.430 మీటర్ల నీరు నిల్వఉందని తెలిపారు. 29.910 టిఎంసిలకు 28.939టిఎంసిల నీరు నిల్వఉందని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో 12,417 క్యూసెక్‌ల వరద నీరు వచ్చి చేరుతోందని డిఈఈ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్థి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, 1401.00 అడుగుల నీరు నిల్వఉందని తెలిపారు.17.802 టిఎంసిలకు, 12 టిఎంసిల నీరు నిల్వఉందన్నారు.