తెలంగాణ

మొక్కలు పెంచితే గేదెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 18: పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశ పెడుతోంది. మొక్కలు పెంచే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆధీనంలోని విజయ డైరీకి పాలుపోసే రైతులకు రాయితీపై పాడి గేదెలను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా సుమారు 65వేల మంది రైతులు విజయ డైరీకి పాలు పోస్తున్నారు. ఇప్పటికే ఉన్న పాల సేకరణ కేంద్రాలను రెట్టింపు చేయనున్నారు. పాల సహకార సంఘాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని సంఘాలను రిజిస్టర్ చేసి ఆ సంఘాల సభ్యులకు ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద కుటుంబానికి ఆరు మొక్కల చొప్పున పెంచినట్లు తగిన ఆధారాలు చూపిస్తే ప్రభుత్వం రాయితీపై రెండు పాడి గేదెలను అందజేస్తుంది. వీటి విలువ సుమారు 60వేలు ఉంటుందని అంచనా. ఓసి, బిసి రైతులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 75శాతం రాయితీ అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం గ్రామస్థాయిలోనే పాల సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నది. కొత్తగా ఏర్పాటు చేసే పాల కేంద్రాలకు నాణ్యత, ఇతర పరికరాలను కూడా అధికారులు ఉచితంగా అందిస్తారు. అలాగే పాడి రైతులకు అటవీ శాఖ నర్సరీల్లో పెంచిన నిమ్మ, టేకు, చింత, గుల్‌మొహర్, జామ లాంటి మొక్కలను ఉచితంగా అందిస్తారు. వీటిని రైతులు ఇళ్ళలో కాని, పొలాల్లో కాని పెంచాల్సి ఉంటుంది. ఇవి చెట్టుగా ఎదిగే వరకు వీటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వారిదే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగువేల మంది రైతులు విజయ డైరీలో పాలు పోస్తుండగా వీరిద్వారా మొక్కల పెంపకం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి 200పాల సేకరణ కేంద్రాలు ఉండగా వాటిని రెట్టింపు చేయాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రోత్సాహకాలు ఇచ్చినా పాల సేకరణ పెరగకపోవడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా ప్రైవేటు డైరీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించడంతో పాటు మెజార్టీ రైతులను ఇందులో భాగస్వామ్యులను చేయాలని కెసిఆర్ నిర్ణయం మేరకు జిల్లాస్థాయి అధికారులు కసరత్తు ప్రారంభించారు. నవంబర్ నుంచి దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.