తెలంగాణ

మీర్‌పేటలో ఇళ్ల కూల్చివేతపై స్టెటస్‌కో ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: హైదరాబాద్‌కు సమీపంలోని మీర్‌పేట్‌లో ఇండ్ల కూల్చివేతకు సంబంధించి స్టేటస్‌కో అమలు చేయాలని హైకోర్టు బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తమ ఇండ్ల స్ధానంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తామని చెప్పి కూల్చివేయడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ శ్రీమతి రమావత్ శారద మరో 13 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు విచారించారు. అనంతరం హైకోర్టు రెండు వారాల పాటు స్టేటస్‌కో అమలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో రెవెన్యూ అధికారులు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది.