తెలంగాణ

ఆయుష్ విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, డాక్టర్ల కొరత చాలా తీవ్రంగా ఉందని, సరైన వౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జన్మదినం సందర్భంగా బిజెపి కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆయుష్ విభాగాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖకు ఆరువేల కోట్లు కేటాయించాలని, ఖాళీలను భర్తీ చేయాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర మంత్రులు కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారని, వారి శాఖలను గాలికి వదిలేశారని అన్నారు. ఎక్సైజ్ శాఖ తప్ప మిగిలిన శాఖలు సరిగా లేవని, ఎక్సైజ్ శాఖ మాత్రం ఆదాయం బాగా సమకూరుస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ ఆరోగ్యం కోసం అనేక ప్రయత్నాలుచ ఏస్తోందని, ఆయుష్‌కు అధిక ప్రాధాన్యతి ఇస్తూ ప్రత్యేక మంత్రిత్వశాఖలను ఏర్పాటు చేసిందని, అందరికీ మందులు చౌకగా అందుబాటులోకి ఉంచేందనుకు దేశవ్యాప్తంగా జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
ఆయుర్వేద వైద్య విధానాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయ కోరారు. వరంగల్‌లో ఆయుర్వేద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, చార్మినార్ ఆయుర్వేదిక్ ఆస్పత్రిని ఆధునీకరించి తగిన నిధులు కేటాయించాలని అన్నారు. ఔషధ మొక్కలు పెంచడానికి కృషి చేయాలని, ఆయుర్వేదిక్ కళాశాలలను ప్రారంభించి సీట్ల సంఖ్యను పెంచాలని, తెలంగాణలో మోడల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. సనత్‌నగర్ ఆయుర్వేదిక్ ఆస్పత్రికి తన నిధుల నుండి డబ్బు మంజూరు చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ మహ్మద్ వహీద్, డాక్టర్ బాపూజీ, డాక్టర్ భాస్కరరావు, డాక్టర్ సురేందర్, డాక్టర్ విశ్వపతి, డాక్టర్ నరేష్‌గౌడ్, డాక్టర్ మర్రి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.