తెలంగాణ

విత్తనోత్పత్తి లక్ష్యం 5.60 లక్షల క్వింటాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్ట్రంలో ప్రభుత్వ నేతృత్వంలో 2017-18 సంవత్సరంలో 5.60 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని తయారు చేస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. 2017 ఖరీఫ్ సీజన్‌లో 3.20 లక్షల క్వింటాళ్లు, 2017-18 రబీ సీజన్‌లో 2.40 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. వరి, మొక్కజొన్న, సోయా తదితర విత్తనాలను తయారు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎస్‌డిసి)-ఎన్‌ఎస్‌సి మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విత్తనోత్పత్తిలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థకు హాకా, ఎన్‌ఎస్‌సి, పశుసంవర్థక శాఖ తదితర సంస్థలు సహకరిస్తున్నాయని వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్, విత్తనధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె. కేశవులు, హాకా మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌సి రీజినల్ మేనేజర్ ఎంవి సుధాకర్ పాల్గొన్నారు.