తెలంగాణ

సిబ్బందికోసం రైల్వే మొబైల్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది కోసం వినూత్న మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ యాప్‌ను బుధవారం సికిందరాబాద్‌లోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్ మధుసూదన్ ప్రారంభించారు. రైల్వే ఆపరేషన్స్, కమర్షియల్ విభాగంలో పనిచేసే సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రైల్వేశాఖలోని కింది స్థాయి సిబ్బందికి తక్షణ సమాచారం కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్‌తో వివిధ విభాగాలకు చెందిన సమాచారం వెనువెంటనే తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టి డిజిటలైజేషన్‌లో భాగంగా రైల్వేశాఖను కూడా డిజిటలైజేషన్ చేసేందుకు జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎలాంటి ఫోన్‌లోకైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. రైల్వే రిజర్వేషన్లు, రిజిస్టర్లు, సిగ్నల్ వ్యవస్థ, ప్రైవేట్ నెంబర్ల ఎక్ఛేంజ్ రిజిస్టర్లు డిజిటలైజేషన్ చేసే యోచనలో ఉన్నట్టు మధుసూదన్ తెలిపారు. రైల్వే సిబ్బంది ఈ యాప్‌తో తమ స్కిల్స్, నాలెడ్జ్‌ను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కెవి రావు, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏఎల్‌ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరింత మెరుగైన సేవలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 18: విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌పిడిసిటిఎల్) సిఎండి జి.రఘుమారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లుల వాడకం తెలుసుకోవాలంటే ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ వివరాలు, యూనిక్ సర్వీస్ నెంబర్ వంటి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చేదని తెలిపారు. దీనివల్ల తలెత్తే వినియోగదారులు ఇబ్బందుల దృష్ట్యా ఇప్పుడు సులభతరంగా తెలుసుకునే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. వెబ్‌సైట్ ద్వారా సులభంగా తమ విద్యుత్ వాడకం బిల్లులను చెల్లించవచ్చని తెలిపారు. విద్యుత్ బిల్లులోని 9 అంకెల యూఎస్‌సి నెంబర్‌ను ప్రామాణికంగా చేసుకుని తద్వారా వినియోగదారులకు చెందిన వాడకం బిల్లు, చెల్లింపు, ఇతర సేవలు పొందేందుకు తగు ఏర్పాట్లు చేశామని సిఎండి తెలిపారు. టి వాలెట్, బిల్ డెస్క్, పేటిఎంల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించే సౌకర్యం కల్పించామని తెలిపారు. అంతేకాకుండా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. నూతన సర్వీస్ కనెక్షన్‌కు సైతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఆ దరఖాస్తు పరిశీలించి రెండు రోజుల్లో కనెక్షన్ మంజూరు చేస్తారని వివరించారు. ఇక మధ్యవర్తులను ఆశ్రయించ వద్దని కోరారు. ఇంకా కేటగిరి మార్పు, చిరునామా మార్పు వంటి వాటిని కూడా ఆన్‌లైన్ ద్వారానే చేసుకునేందువీలు కల్పించామని సిఎండి వివరించారు.