తెలంగాణ

బాలకార్మికులు లేని తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: వచ్చే ఐదేళ్లలో బాలకార్మికులు లేని బంగారు తెలంగాణ రూపకల్పనకు విధివిధానాలను, సమగ్ర కార్యాచరణను రూపొందించినట్టు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గంగాధర్ సభావత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నిర్మూలన పునరావాస సవరణ చట్టంలో మరిన్ని నియమనిబంధనలు చేర్చి దానిని తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా అమలుచేస్తామని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అనేక చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. రాష్టస్థ్రాయి వనరుల కేంద్రం (ఎస్‌ఆర్‌సి) ఏర్పాటు చేసిన వర్కుషాప్‌లో ఆయనతో పాటు జిల్లా బాలల సంరక్షణ అధికారి ఇంతియాజ్ రహీం, ఎఎల్‌ఒ బి నీలిమ, ఎస్‌ఆర్‌సి కోఆర్డినేటర్ వర్షా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ బాలకార్మికులను గుర్తించి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే గాక, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, ప్రతి మూడు నెలలకోమారు వారి సంరక్షణపై ఆరా తీస్తున్నామని తద్వారా వారు జీవితంలో స్థిరపడేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. బాలకార్మికుల సమాచారం తెలుసుకునేందుకు 1098 టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తోందని, రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సుతో పాటు జిల్లాల్లో కూడా టాస్క్ఫోర్సులను ఏర్పాటు చేశామని , మండల, గ్రామ స్థాయిలో కమిటీలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలో అందరూ తోడ్పాటు అందించాలని, 21 శాఖలతో కార్మిక శాఖ సమన్వయం సాధిస్తూ చైతన్యం తెస్తోందని అన్నారు. గతంలో బాలలతో పనిచేయించే వారికి స్వల్ప శిక్షలు ఉండేవని, ఇపుడు వాటిని మరింత కఠినతరం చేసినట్టు చెప్పారు. సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించి 18 ఏళ్లలోపు వారు ఎక్కడ పనిచేసినా వారిని బాల కార్మికులుగా గుర్తించడం జరుగుతుందని అన్నారు. 14 నుండి 18 ఏళ్ల లోపు వారు ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయకుండా నియంత్రిస్తున్నామని ఇందుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని అన్నారు. గుర్తించిన బాలకార్మికులను బ్రిడ్జిస్కూళ్లలో చేరుస్తున్నామని, అలాగే నైపుణ్యాన్ని అందించే శిక్షణ కేంద్రాల్లో వారికి తర్ఫీదు ఇస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో వేల్పూరు మండలం బాలకార్మికులు లేని మండలంగా, రంగారెడ్డి జిల్లా మోతీలాల్ గ్రామం బాల కార్మికులు లేని గ్రామంగా పేరుతెచ్చుకున్నాయని అదే రీతిన రాష్ట్రం అంతా బాలకార్మికులు లేకుండా చేయాలనేది ప్రభుత్వ సంకల్పమని అన్నారు.
నిరంతరం పనిచేయించడం నేరం
బాలలతో ఆదాయం వచ్చే పనులను చేయించడానికి వీలు లేదని, అలాగే కుటుంబ వారసత్వ పనుల్లో కూడా నిరంతరం పనిచేయడానికి వీలు లేదని పేర్కొంటూ కేంద్రం బాలకార్మిక చట్టాన్ని సవరించిందని ఈ సందర్భంగా చెప్పారు. మరింత సమగ్ర మార్గదర్శకాలు ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని పేర్కొన్నారు.