తెలంగాణ

అమరుల కుటుంబాలకు చేయూతనిస్తాం: ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటామని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున పూర్తి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. అమరులైన పోలీసు సిబ్బందికి పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. ప్రజల మన, ధన, ప్రాణాల రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన సిబ్బంది సేవలను జాతి ఎన్నడూ మరువజాలదన్నారు. అమరులను స్ఫూర్తిగా తీసుకుని విధినిర్వహణకు పునరంకితం కావాలని సిఎం పిలుపు ఇచ్చారు.