తెలంగాణ

అధికారం ఉంటే సస్పెండ్ చేసేవాణ్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ‘నాకే అధికారం ఉంటే రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వాన్ని..’ అని టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రేవంత్ రెడ్డితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే అధికారం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పార్టీకి ఉందన్నారు. చంద్రబాబు మాటకు తప్ప ఎవరికీ కట్టుబడి ఉండమని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటకు ఎవరూ కట్టుబడి ఉండరని ఆయన చెప్పారు. లిస్టు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అందరూ పార్టీ వీడమని, చంద్రబాబు వెంటే ఉంటామని చెప్పారని ఆయన తెలిపారు. అందరూ చంద్రబాబు నాయకత్వంలో ముందుకు సాగుతామని, ఎవరూ అధైర్యపడడం లేదన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని మోత్కుపల్లి తెలిపారు.
క్రమశిక్షణా చర్యలు తప్పవు: రమణ
పార్టీ క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించినా క్రమశిక్షణా చర్యలు తప్పవని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరు మీడియాలో మాట్లాడినా దానికి వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. లోగడ తనపై కూడా తప్పుడు వార్తలు వచ్చాయని, అప్పుడు తాను ప్రాణం ఉన్నంత వరకూ టిడిపిలోనే ఉంటానని వివరణ ఇచ్చానని ఆయన గుర్తు చేశారు.
కన్నీరు పెట్టిస్తే బాగుపడరు..
రైతులతో కన్నీరు పెట్టిస్తే రాజ్యం బాగుపడదని టి.టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం అన్నారు. గత 15 రోజులుగా లక్షలాది క్వింటాళ్ళ ధాన్యం, పత్తి రైతులు మార్కెట్‌లకు తీసుకెళుతున్నా తగినన్ని కొనుగోలు కేంద్రాలు లేవని, మద్దతు ధర లభించడం లేదని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న రమణ, మోత్కుపల్లి