తెలంగాణ

హైదరాబాద్‌లో ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: గ్రేటర్ పరిధిలోని జూబ్లిహిల్స్ నియోజక వర్గంలో శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. నియోజక వర్గ పరిధిలోని బోరబండ, రహమత్‌నగర్ డివిజన్ల పరిధిలో శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఓసారి భూమి కదిలినట్టు అనిపించినా బంబుల పేళుల్లతో ఇలా జరిగి ఉంటుందని స్థానికులు భావించారు. అయితే శనివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో మరింత తీవ్రతో భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భూ కదలికలకు ఇళ్లలోని సామాగ్రీ క్రిందపడిపోగా, గోడలకు బీటలు వచ్చాయి. ఇళ్లలోని సామాగ్రీ ఒక్కసారిగా ఊగిపోతూ భారీ శబ్దంతో క్రిందపడిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు.
దీంతో ఆయా డివిజన్ల ప్రజలు ఉదయం 7గంటల వరకు ఇళ్లలోకి వెళ్లేందుకు వణికి పోయారు. భూమి కంపించిన విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ మండల తహసీల్దార్ సైదులు తన బృందంతో శనివారం ఉదయం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిక్టర్‌స్కేల్‌పై భూ కంప తీవ్రత ఏ స్థాయిలో నమోదు అయిందోనన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

చిత్రం..భూమి కంపించడంతో ఓ ఇంటి గోడకు బీటలు ఏర్పడ్డ దృశ్యం