తెలంగాణ

కోతకు గురైన భీమా కాల్వ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, అక్టోబర్ 22: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని మందాపూర్ గ్రామ సమీపంలో భీమా కాల్వ ఆదివారం సాయంత్రం నీటి ఉద్ధృతికి కోతకు గురైంది. దీంతో సమీపంలో ఉన్న వీరన్న చెరువులోకి ప్రవహించడంతో చెరువులోని సగానికి పైగా నీళ్లు లోబ్యాంకింగ్ ద్వారా కాల్వలోకి ప్రవహిస్తున్నాయ. విషయం తెలుసుకున్న సర్పం చ్ జయరాములు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌సాగర్, జిల్లా నాయకుడు తిరుపతయ్య తదితరులు భీమా కాల్వ కోత కు గురైన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. వారి వివరాల ప్రకారం భీమా కాల్వ కోతకు గురై వీరన్న చెరువులోకి ప్రవహించడంతో వీరన్నచెరువు నుండి నీరు వృధాగా కాల్వలోకి వెళ్లడంతో చెరువు సగానికి పైగా ఖాళీ అయంది. ఇటీవలనే 3 లక్షల చేప పిల్లలను చెరువులో వదిలామని, నీటి ప్రవాహంతో చేపపిల్లలన్నీ కాల్వలోకి వెళ్లిపోయాయని స్థానికులు వాపోయారు. ఇటీవలనే నిండిన వీరన్నచెరువు సంగానికి పైగా ఖాళీ అవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.