తెలంగాణ

రాజకీయాలే తప్ప..పాలనలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, అక్టోబర్ 22: టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానంలో పాలిటిక్స్ పుల్..పాలన నిల్ అని..అప్రజాస్వామిక పరిపాలన కొనసాగిస్తోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో అవినీతి అక్రమాల విషయాలు సిఏం దృష్టికి వచ్చినా స్పందించడం లేదన్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు అన్యాయానికి గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అధికారులచే పంటనష్టం సర్వే చేయించలేని పరిస్థితి ప్రభుత్వం ఉందన్నారు. రైతులకు ఎకరాకు 4వేలు ఇస్తామంటూ రైతులను ఊరడిస్తుంది తప్ప చేసేదేమీ లేదన్నారు. టిఆర్‌ఎస్ రైతులకు వ్యతిరేకమన్నారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో వ్యత్యాసం చూపిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తోందన్నారు.
కాంట్రాక్టర్లు దోచుకునే విధంగా ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రతి రంగంలో వివక్ష చూపిస్తోందన్నారు. ప్రజల్లో ఇప్పటికే టిఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఉన్న వారందరు బిజెపిలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో రజాకార్ల పాలన సాగుతోందన్నారు, గతంలో హైదరాబాద్‌లో మాత్రమే రజాకార్ల పాలన ఉంటే ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో రాజాకార్ల పాలన సాగుతోందని విమర్శించారు. ఇరిగేషన్ శాఖలో అవినీతి జరుగుతోందని, వర్కింగ్ ఎస్టిమెట్స్ వేస్తే వేల కోట్లు బయట పడుతుందని సవాల్ విసిరారు. సిఎం ప్రగతి భవన్‌కే పరిమితం కావడం కాదన్నారు.
ప్రజల వద్దకు సిఎం వెళ్లాలి కానీ ప్రజలను తన వద్దకు పిలవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సబ్సిడీ గొర్రెలు, చేప పిల్లలు చనిపోతున్నాయన్నారు. తెంగాణ రాష్ట్రంలో ఇంకా ఆంధ్రోళ్ల పెత్తనమే కొనసాగుతోందన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకే పనులు ఇస్తున్నారన్నారు. ప్రజా హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే ఊరుకునేది లేదని, బిజెపి ప్రజల పక్షాన ఉంటు పోరాటం చేస్తుందన్నారు.
ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి, రాష్ట్ర నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమారాణి, నాయకులు బిక్షపతి, శ్రీనివాస్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..సిద్దిపేటలో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి నేత నాగం జనార్దన్‌రెడ్డి