తెలంగాణ

ప్రశాంతంగా నిర్వహిస్తాం, అనుమతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: అమరుల స్ఫూర్తి యాత్రను ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంతగా నిర్వహిస్తామని అందుకు అనుమతి ఇవ్వాలని టిజాక్ సోమవారం నాడు హైకోర్టును కోరింది. అవసరమైతే ఇందుకు సంబంధించి అండర్‌టేకింగ్ ఇస్తామని కూడా టిజాక్ నేతలు పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుండి 22 వరకూ నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో తలపెట్టిన అమరుల స్ఫూర్తి యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని పేర్కొంటూ టిజాక్ తరఫున కో కన్వీనర్ ఐ గోపాల్ శర్మ దాఖలు చేసిన పిటీషన్‌పై జస్టిస్ ఎస్ వి భట్ విచారణ జరిపారు. పిటీషనర్ల తరఫున బి రచనా రెడ్డి తమ వాదన వినిపించారు. అన్ని వివరాలను అందించినా పోలీసులు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
కాళేశ్వరంపై నేడు విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే ఉత్తర్వులపై మంగళవారం విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అడ్వకేట్ జనరల్ డి ప్రకాష్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధ్, జస్టిస్ జి గంగారావులతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని మంగళవారం నాడు విచారించనున్నట్టు పేర్కొంది.
విద్యార్థి తరగతి తగ్గింపుపై పిటిషన్
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో రెండోతరగతి చదువుతున్న కె అద్వేత్యను ఒకటో తరగతికి తగ్గించడంపై దాఖలైన పిటీషన్‌పై బుధవారం నాడు విచారణ చేపట్టనున్నట్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ , జస్టిస్ ఎం గంగారావులతో కూడిన బెంచ్ పేర్కొంది. తరగతి తగ్గించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేశారని, మానవతా దృక్పథంతో ఈ అంశాన్ని పరిశీలించాలని విద్యార్థిని అమ్మమ్మ దాఖలు చేసిన పిటీషన్‌పై బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
రిఫండ్ కోసం పిటిషన్ వేయండి
సదావర్తి భూముల కొనుగోలుకు సంబంధించి తాను చెల్లించిన 27.44 కోట్ల రూపాయిలను వెనక్కు ఇవ్వాలన్న వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు అనుమతించింది. రిఫండ్‌కు సంబంధించి మరో పిటిషన్‌ను దాఖలు చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ ఎం గంగారావులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.