తెలంగాణ

8 నుంచి బాలల చలన చిత్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ఈ ఏడాది నవంబర్ 8 నుంచి వారం రోజుల పాటు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ ఉత్సవానికి బాలివుడ్, హాలివుడ్‌తో పాటు ప్రపంచంలోని చిత్ర రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరు కానున్నారు. గోల్డెన్ ఎలిఫెంట్ పేరుతో అతి పెద్ద ఉత్సవంగా నిర్వహించే 20వ బాలల చలన చిత్రోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం ఆతిధ్యం ఇస్తోంది. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐసిఎఫ్‌ఎఫ్‌ఐ)ను చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎఫ్‌ఎస్‌ఐ), కేంద్ర సమచార, ప్రసార శాఖలతో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఈ బాలల చలన చిత్ర ఉత్సవాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని సిఎఫ్‌ఎస్‌ఐ సిఈఓ డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. 109 దేశాల నుంచి వివిధ కేటగిరీల్లో రికార్డు స్థాయిలో 1402 ఎంట్రీలు అందాయని తెలిపారు. 2022 నాటి నవభారతం అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు న్యూ ఇండియా పేరుతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలల్లో చలన చిత్ర ఉత్సవాల ద్వారా సంస్కృతి, జీవన విధానం, మానసిక పరిపక్వత వంటి అంశాలను ప్రభావితం చేసే దిశగా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో యానిమేషన్, డాక్యుమెంటరీ, షార్ట్ పిలిమ్స్ వంటి వాటిని ప్రదర్శిస్తారని తెలిపారు.