తెలంగాణ

జాగా కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: రాష్ట్రంలో పేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. వీటి నిర్మాణానికి అవసరం అయిన స్థలాలను రెవెన్యూ శాఖ అనే్వషిస్తోందని తెలిపారు. 10 జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్థలాల అనే్వషణపై దృష్టిసారించినట్టు చెప్పారు. అవసరం అయిన స్థలాల కోసం వివిధ సంస్థలతో చర్చిస్తున్నట్టు తెలిపారు. వచ్చే పదేళ్లలో ఇళ్లు లేని పేద ప్రజలు రాష్ట్రంలో ఉండరని అన్నారు. అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్‌నగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్నో ఆరోపణలు చేశారని, ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోకుండా తెలంగాణ అభివృద్ధి కోసమే తపిస్తున్నారని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలలను హైదరాబాద్‌కు తీసుకు వచ్చినట్టు చెప్పారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా అన్ని జిల్లాలకు మంచినీరు అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ పేదవారికి రోటీ, కపడా, మకాన్ ఎంతో ముఖ్యం అని ముఖ్యమంత్రి ఆ పథకాలపై దృష్టిసారించారని తెలిపారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని ఎంతోమంది అడిగారని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాతనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఆసరా పించన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్, ఆరోగ్య లక్ష్మి, వాటర్ గ్రిడ్ వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు.