తెలంగాణ

గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21 : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీర్ చందూలాల్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, గత అరవై ఏళ్లనుండి తెలంగాణలోని గిరిజనులకు న్యాయం జరగలేదని వాపోయారు. రెగ్యులర్ బడ్జెట్‌తో పాటు గిరిజన ఉపప్రణాళిక (టిఎస్‌పి) నిధులు తెలంగాణ జిల్లాల్లో ఖర్చు చేయకపోవడంతో ఈ జిల్లాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గిరిజనుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో జీవిస్తున్న 13 వేల కుటుంబాలకు చెందిన ప్రిమిటివ్ గ్రూప్ గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనుల విద్య, ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నిరుడు నాలుగు బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా మార్చామని, వరంగల్ ఖమ్మం జిల్లాల్లో కొత్తగా మరో రెండు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని వివరించారు. ‘బెస్ట్ అవేలబుల్’ సీట్ల ద్వారా 10 వేల మంది గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 2016-17 సంవత్సరంలో అన్ని పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెడుతున్నామని, ఎలక్ట్రానిక్ విధానంలో బోధన కోసం 60 కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. పాఠశాలకు చిన్న చిన్న మరమ్మతులు చేసేందుకు 18 కోట్ల రూపాయలు కేటాయించామని, ఈ మేరకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించి ఫీజు రీఇంబర్స్‌మెంట్ కింద 190 కోట్ల రూపాయలను ఇటీవలనే విడుదల చేశామని మంత్రి చందూలాల్ తెలిపారు. ఈ సంవత్సరం మరో 75 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 10 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నామని చందూలాల్ తెలిపారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికోసం ఈ సంవత్సరం 212 కోట్ల రూపాయలు వ్యయం చేయాలని నిర్ణయించామన్నారు. గిరిజనుల నాయకుడు కొమురం భీం జ్ఞాపకార్థం ఆదిలాబాద్ జిల్లాలోని జోడెఘాట్‌లో ప్రత్యేక కేంద్రాన్ని నిర్మిస్తున్నామని త్వరలోనే ఇది పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిరుటికంటే ఈ ఏడు ఎస్‌టిల కోసం నిధులు ఎక్కువగా ఖర్చు చేయాలని నిర్ణయించామని, ఈ ఏడు 6180 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.