తెలంగాణ

రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా మార్చుతాం: కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా మార్చుతామని మున్సిపల్, పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపే చూస్తుందన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 8 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు మంత్రి కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

ప్లీనరీలోనే కెసిఆర్ ప్రచారం
హైదరాబాద్, ఏప్రిల్ 21: పాలేరు శాసన సభా నియోజక వర్గం ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా ప్రచారం చేయరని, ఖమ్మంలో జరిగే పార్టీ ప్లీనరీలోనే ప్రసంగిస్తారని టిఆర్‌ఎస్ వర్గాలు తెలిపారు. పాలేరు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఖమ్మంలో 27న టిఆర్‌ఎస్ ప్లీనరీ ఖరారైంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో టిఆర్‌ఎస్ ప్లీనరీకి ఆటంకాలు ఎదురుకాకుండా ఐటి మంత్రి కెటిఆర్ ముందుగానే రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు ప్లీనరీ అనుమతి కోసం లేఖ రాశారు. మరోవైపు ప్లీనరీకి అనుమతి ఇవ్వవద్దని, దీని వల్ల అధికార దుర్వినియోగానికి అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ రెండు లేఖలను కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పంపిస్తామని, కేంద్ర కమీషనే నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు.

మూడు నెలల్లో పరిష్కరించాలి
ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి
పిటిషన్‌పై హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 21: జగన్ అక్రమాస్తుల కేసులో ఐఆర్‌ఎస్ అధికారి కెవి బ్రహ్మానందరెడ్డి పెట్టుకున్న పిటిషన్‌పై వచ్చే మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం సిబిఐ కోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు జడ్జి జస్టిస్ రాజా ఎలాంగో జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో వాన్‌పిక్‌కు రాయితీపై భూములు కేటాయించడంపై జరిగిన ఎంఓయూలో ఈ అధికారి కీలకపాత్ర వహించారంటూ సిబిఐ అభియోగం మోపింది. కాగా తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశారని ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇప్పటికే సిబిఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. కాగా మరో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.