తెలంగాణ

వైభవంగా లక్ష్మీనరసింహుల కవచమూర్తుల ప్రతిష్ఠాపనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 21: తెలంగాణ తిరుపతి యాదాద్రి పుణ్యక్షేత్రంలోని గుట్టపై నూతనంగా నిర్మించిన బాల ఆలయాన్ని గురువారం లక్ష్మీనరసింహుల కవచమూర్తుల ప్రతిష్ఠాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలను ప్రారంభించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో ప్రధాన ఆలయంలో స్వయంభూ లక్ష్మీనరసింహులకు పూజలు నిర్వహించి పూర్ణకుంభంలోకి స్వామివారలను ఆవాహన చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహుల కవచమూర్తులను ఊరేగింపుగా బాల ఆలయంలోకి తీసుకెళ్లారు. పాంచరాత్ర ఆగమన శాస్తయ్రుక్తంగా బాల ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహించారు. మహాకుంభాభిషేకం, ఆరాధన, మహానివేదన చేసి భక్తులకు ప్రసాద వితరణ చేసిన పిదప బాల ఆలయంలో భక్తులకు లక్ష్మీనరసింహుల దర్శనాలకు అనుమతించారు. అటు ప్రధాన ఆలయంలో స్వయంభూ లక్ష్మీనరసింహుల దర్శనాలను గురువారం ఉదయం నుండే నిలిపివేశారు. బాల ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహులు, ఆండాళ్ అమ్మవారు, క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వాములను భక్తులు ఉత్సాహంగా దర్శించుకున్నారు.

చిత్రం యాదాద్రి బాల ఆలయంలో లక్ష్మీనరసింహుల కవచమూర్తుల
ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణరెడ్డి, జగదీష్‌రెడ్డి