తెలంగాణ

ఆల్‌రౌండర్ రంగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం నాడు విడుదల చేశారు. సమగ్ర వివరాలతో కూడిన సిడిని ఆయన ఆవిష్కరించారు. ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుశీల్ కుమార్ , జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఫస్టియర్ జనరల్‌లో 53.55 శాతం, ఒకేషనల్ లో 50.6 శాతం, సెకండియర్ జనరల్‌లో 62.95 శాతం, ఒవోకేషనల్‌లో 59.17 శాతం ఉతీర్ణులయ్యారు. గత ఏడాది కంటే సెకండియర్ ఫలితాలు పెరగ్గా, ఫస్టియర్ ఫలితాల శాతం తగ్గింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలకు ఈ నెల 30వ తేదీలోగా ఫీజును చెల్లించాల్సి ఉంటుందని కడియం స్పష్టం చేశారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి మొదలవుతాయి. జిల్లాల వారీ సెకండియర్ ఫలితాల పరంగా చూస్తే తొలి స్థానంలో రంగారెడ్డి నిలిచింది. చివరి స్థానంలో మెదక్ నిలిచింది. ఫస్టియర్‌లో అగ్రస్థానంలో రంగారెడ్డి నిలవగా, చివరి స్థానంలో నల్గొండ నిలిచింది.
26 నాటికి మార్కుల జాబితాలు
ఈ నెల 26వ తేదీ నాటికి కాలేజీలకు మార్కుల జాబితాలను పంపిస్తామని బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ చెప్పారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈ నెల 30లోగా చెల్లించాలని, ఇంప్రూవ్‌మెంట్ రాసే వారికి సైతం గడువులోగా ఫీజులను చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రీకౌంటింగ్‌కు వంద రూపాయిలు చొప్పున, స్కాన్ చేసిన సమాధాన పత్రం కోసం 600 రూపాయిలు చెల్లించాలని అభ్యర్ధులు ఇందుకోసం టిఎస్‌బిఐఇ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని అధికారులు చెప్పారు. మే 24 నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. ఉదయం 9 నుండి 12 వరకూ ఫస్టియర్ పరీక్షలు, సాయంత్రం 2.30 నుండి 5.30 వరకూ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. 24న సెకండ్ లాంగ్వేజి, 25న ఇంగ్లీష్, 26న మాథ్స్, బోటనీ, సివిక్స్, సైకాలజీ, 27న మాథ్స్ రెండోపేపర్, జువాలజీ, హిస్టరీ, 28న ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజి, 29న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్సు, మ్యూజిక్, 30న జియాలజీ, హోం సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు, 31న మోడరన్ లాంగ్వేజి పేపర్ ఉంటాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 1 నుండి ఆరోతేదీ వరకూ జరుగుతాయి ఎథిక్స్ పేపర్ జూన్ 7న జరుగుతుంది, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 8న జరుగుతుంది.
ఫలితాలను పరిష్కారం కాల్ సెంటర్లు ద్వారా అందుబాటులో ఉంచామని అన్నారు. 1100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని లేకుంటే రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండైనా 18004251110కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.
కాలేజీల ప్రిన్సిపాల్స్ మాత్రం బిఐఇ డాట్ తెలంగాణ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్ సైట్ నుండి కాలేజీల వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు.