తెలంగాణ

2019 ఎన్నికలే లక్ష్యంగా కలిసి పని చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ‘తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా కలిసి పని చేద్దాం..’ అని పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నాయకులు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులు జగత్ ప్రకాశ్‌నడ్డా, నిర్మాలా సీతారామన్, హన్స్‌రాజ్, బండారు దత్తాత్రేయ, బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు తమ ప్రసంగాలతో కార్యకర్తలను ఉర్రూతలూగించారు. కార్యకర్తలు కూడా ఉత్సాహంగా బాజాభజంత్రీలతో సభా ప్రాంగణానికి తరలి వచ్చారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా ప్రసంగిస్తూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలతో దేశాన్ని నాశనం చేసిందని, అందుకే ప్రజలు 2014 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని తెలిపారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వారి వద్ద ఒక్క అంశం లేదని అన్నారు. బిజెపికి నీతి, నిజాయితీ గల కార్యకర్తలు ఉన్నారని, పార్టీకి దిశ-దశ ఉన్నదని అన్నారు.కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ ప్రసంగిస్తూ భారత్ మాతాకీ జై అనబోమని ప్రకటించిన మజ్లిస్ పార్టీతో జత కట్టడం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సిగ్గు చేటని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, దేశంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారని ఆయన తెలిపారు. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు.
తెలంగాణను ఫార్మా, పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పత్తి రైతులు ఆందోళన చెందకుండా సిసిఐ ద్వారా కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పంటలకు బీమా కల్పించడం జరిగిందని అన్నారు. 2019లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడాలని, అందుకు తామంతా అండగా ఉంటామని ఆమె చెప్పారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ రాష్ట్రంలో నీళ్ళు లేక ప్రజలు అలమటిస్తున్నందున ప్రధాని మోదీ 790 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. మురికి వాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని అన్నారు.బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు మాట్లాడుతూ భారత్ మాతాకీ జై అనడానికి నిరాకరించిన మజ్లిస్ పార్టీకి లోగడ నిజాంకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. మజ్లిస్‌ను ఎదుర్కొనే సత్తా బిజెపికే ఉందని ఆయన అనగానే సభికులు కేరింతలు కొట్టారు.
పాండవులం: లక్ష్మణ్
బిజెపి నూతన అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రసంగిస్తూ తాము పాండవుల్లాగా ఐదుగురు ఎమ్మెల్యేలే అయినా వందమంది కౌరవులను ఎదుర్కొంటామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్. ఇంద్రసేనా రెడ్డి తదితరులు ప్రసంగించారు.