ఆంధ్రప్రదేశ్‌

వడదెబ్బతో 21 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్/మహబూబ్‌నగర్/ నల్లగొండ/కరీంనగర్/ వరంగల్/మెదక్, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణతాపం నమోదవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కంటే ప్రతి రోజు 4 నుండి 5 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో శనివారం 44.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో శనివారం ఒకే రోజు వడదెబ్బ సోకి ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు మైనర్ చిన్నారులే ఉండడం గమనార్హం. బోథ్ మండలం అందూర్ పంచాయతీ పరిధిలోని మందబొగడ గ్రామానికి చెందిన కొడప ఝాన్సి (16), తానూర్ మండలం ఎల్వీడ్ గ్రామానికి చెందిన బసవేశ్వర్ (8) అనే బాలుడు, దండేపల్లి మండలం మేదరిపేటలో అజీంఖాన్ (33) అనే యువకుడు, మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని గున్‌ముక్ల గ్రామానికి చెందిన చిట్టేమ్మ (37) అనే మహిళ, ఇటిక్యాల మండల పరిధిలోని కొండేరు గ్రామానికి చెందిన దళిత దావీద్ (60) అనే వృద్ధుడు, అడ్డాకుల మండల పరిధిలోని నిజాల్‌పూర్ గ్రామానికి చెందిన బుచ్చమ్మ (75), కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన గొడుగు పెంటయ్య (68) అనే వృద్ధుడు, కేశంపేట మండల పరిధిలోని అల్వాల గ్రామానికి చెందిన గాండ్ల యాదమ్మ (60) అనే వృద్ధురాలు, నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన పొట్టిపంగ గురవయ్య (67) అనే వృద్ధుడు, గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల యాదగిరి (60) వృద్ధుడు, కేతేపల్లి మండలంలోని కాసనగోడు గ్రామానికి చెందిన ఉప్పల నర్సయ్య(43) అనే కూలీ, చిట్యాలకు చెందిన గండమళ్ళ వెంకులు (65) అనే వృద్ధుడు, ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతసూర్యాపేట ఆవాసం దుబ్బ తండాకు చెందిన జాటోతు సైదులు (64) అనే వృద్ధుడు, మిర్యాలగూడ మండలంలోని నందిపహాడ్ గ్రామపరిదిలోని భాగ్యతండాకు చెందిన ధనావత్ ఆమలి (37) అనే వ్యక్తి, వేములపల్లి మండలం గుర్రప్పగూడెంకు చెందిన పందిరి రాములమ్మ(55) అనే ఉపాధి కూలీ, దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామానికి చెందిన రూపావత్ హరిచంద్రు(63) అనే వృద్ధుడు, పెద్దవూర మండల పరిధిలోని నాయకుని తండాకు చెందిన తుంగతుర్తి జానకమ్మ (62) అనే మహిళా కూలీ, వరంగల్ జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన కూరపాటి సాంబయ్య (65) అనే వృద్ధుడు, మరిపెడ మండలంలోని ఎల్లంపేట శివారు మంచ్యాతండాకు చెందిన మూడ్ మంగ్యా(45). కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని కటికనపెల్లి గ్రామానికి చెందిన పల్లికొండ భీమయ్య (45) అనే ఉపాధి కూలీ, మెదక్ జిల్ల్లా శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన లక్ష్మి (56) మరణించారు.