తెలంగాణ

ప్రకాష్‌రాజ్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: రాష్ట్రంలో ఎందరో రాజకీయ నాయకులు, సిని హిరోలు, నటులు, మంత్రులు, వ్యాపారవేత్తలు పబ్లిసిటీ కోసమో లేక జీవితంలో ఏదో ఒక మంచి పని చేసి చూపించాలనే తపనతో తాము ఫలాన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రముఖ సిని నటుడు ప్రకాష్‌రాజ్ గత సంవత్సరం ఆగస్టు మాసంలో దత్తత తీసుకున్నారు. అయితే ప్రకాష్‌రాజ్ కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకోవడంతో ఆగ్రామస్తులు ఇక తమ గ్రామం అభివృద్ది పథంలో నడుస్తుందని కొండంత ఆశ పెట్టుకున్నారు. దత్తత అనే పదానికి మరింత ప్రాధాన్యత కలిగించేందుకు కొండారెడ్డిపల్లిలో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గ్రామస్తుల ఆశలను నెరవేర్చే పనిలో పడ్డారు. గ్రామంలో వంద శాతం అక్షరాస్యత ఉండాలనే సంకల్పంతో విద్యాభివృద్దిక్కై ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి రెండు ఎకరాల భూమిని స్వంత డబ్బులతో కొనుగోలు చేసి ఈస్థలంలో పాఠశాల నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో తీవ్రమైన మంచినీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని రెండు బోర్లను కూడా వేయించారు. రెండు బోర్ల ద్వారా వచ్చే నీటిని లింక్ చేసి 30వేల లీటర్ల ట్యాంక్‌ను కూడా నిర్మించారు. మూడు సార్లు ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామస్తులతో శబాష్ అనిపించుకున్నారు. దీర్ఘకాలిక రోగాలతో పలువురు బాధపడుతుంటే ఈ వైద్య శిబిరాల ద్వారా వారికి బాగా ఉపయోగపడింది. గ్రామ ముఖద్వారాలను ఏర్పాటు చేసి గ్రామానికి వచ్చిపోయే వారికి స్వాగతం పలికే విధంగా అలంకరించారు.

దేవుడిలా సహాయపడ్డాడు
సినీ నటుడు ప్రకాష్‌రాజ్ తమ గ్రామం కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకోవడం పూణ్యానా తమ గ్రామానికి, తనకు వ్యక్తిగతంగా దేవుడిలా ఎంతో ఉపయోగపడ్డాడని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పి.మాధవి అభిప్రాయం వ్యక్తం చేశారు. కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ దత్తత తీసుకోవడం పట్ల ‘ఆంధ్రభూమి’ ప్రతినిధి ఆ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో అభిప్రాయాలను సేకరించారు. ఈ సంధర్భంగా గ్రామానికి చెందిన పి.మాధవి గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు నడవలేని స్థితికి మంచం పట్టింది. అయితే ఇటీవల ప్రకాష్‌రాజ్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి వచ్చి అమె వైద్యులతో తమ గోడును వినిపించుకుంది. దీంతో చలించిపోయిన ప్రకాష్‌రాజ్ ఎలాగైనా మాధవిని నడిపించాలనే తపనతో హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రిలో శస్తచ్రికిత్స చేయించారు. ఆమె ప్రస్తుతం తిరిగి నడువగలుతుంది. తాను తిరిగి నడవడానికి అవకాశం కల్పించిన ప్రకాష్‌రాజ్ దేవుడిలాంటి వ్యక్తి అని ఆమె అభిప్రాయపడ్డారు. తమ గ్రామం ఆయన పుణ్యానా అభివృద్ది చెందాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
- మాధవి, కొండారెడ్డిపల్లి గ్రామస్థురాలు