తెలంగాణ

ఎంవిఐ పోస్టులకు ప్రాథమిక జాబితా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనస్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ వివిధ వడపోతల దశలను దాటి తుది దశకు చేరింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనస్పెక్టర్ పోస్టులకు గత ఏడాది సెప్టెంబర్ 23న తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 45 పోస్టులకు గానూ 6వేల మంది దరఖాస్తు చేశారు. వీరందరికీ కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్టును గత నవంబర్ 8న నిర్వహించారు. టెస్టు ఆధారంగా 225 మందిని ఎఎంవిఐ పోస్టులకు మెరిట్ లిస్టును ప్రకటించింది. వీరందిరకీ సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్ చేసి పిజికల్ టెస్టుకు 106 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఒక్కో పోస్టుకు ఇద్దరిని సిద్ధం చేసి వారి నుండి మెరిట్ అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.