తెలంగాణ

బిజెపి నేతలు ఏం సాధించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23:కేంద్రం లో బిజెపి ప్రభుత్వం ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీ నాయకులు ఏమీ సాధించలేకపోతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణకు ఏమీ సాధించలేక విఫలం అయిన బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుని బిజెపి నాయకులు మాట్లాడితే బాగుంటుందని అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలు అర్ధం లేనివని టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణలో అమలు జరుగుతున్న పలు పథకాలను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అభినందించారని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నీతి ఆయోగ్ సైతం ముఖ్యమంత్రులకు లేఖ రాసిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. కేజీటు పీజీ ఉచిత విద్య పథకం మినహా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అన్నింటిని అమలు చేసినట్టు చెప్పారు. కానీ విపక్షాలు చేసిందేమీ లేదని, వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తెలంగాణ కోసం తెలంగాణ బిజెపి నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్‌లో పన్ను రాయితీ ఉందని, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలోనూ పన్ను రాయితీ అమలు చేయాలని పార్లమెంటులో టిఆర్‌ఎస్ కోరితే బిజెపి నాయకుల నుంచి ఎలాంటి మద్దతు లేదని చెప్పారు. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి బిజెపి నాయకులు ఎప్పుడైనా కేంద్ర నాయకత్వంతో మాట్లాడారా? పార్లమెంటులో ప్రశ్నించారా? అని కర్నె ప్రభాకర్ అడిగారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బిజెపి నుంచి ఎలాంటి మద్దతు లేదని చెప్పారు. తెలంగాణకు బిజెపి చేసింది ఏమీ లేదని అన్నారు. తెలంగాణ కోసం ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టే ఎన్నికల్లో సరైన తీర్పు ఇస్తున్నారని అన్నారు. పాలేరులో సైతం విపక్షాలు డిపాజిట్ల కోసమో పోరాడాలని ఎద్దెవా చేశారు. విపక్షాలు గెలుపుపై ఎప్పుడో ఆశలు వదులుకున్నారని, డిపాజిట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. టిఆర్‌ఎస్ గురించి విపక్షాలు చెప్పే అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని కర్నె ప్రభాకర్ తెలిపారు.