తెలంగాణ

కూతుర్ని చంపి తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, నవంబర్ 15: జిల్లా కేంద్రం లో అత్త, మామ, ఆడబిడ్డ వేధింపులు భరించలేక కన్నకూతుర్ని చంపి.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకుం ది. ఎస్‌ఐ గడికొప్పుల సతీష్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కాలేజీరోడ్డులోని మిమ్స్ హైస్కూల్ ఎదురుగా ఉంటున్న కేతిరెడ్డి విజ్ఞలత రెడ్డి (26) తన నాలుగేళ్ల కుమార్తె కృషిక రెడ్డిని ముం దుగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసింది. కుమార్తె మరణించిన తరువాత మరో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీర తో ఉరివేసుకుని తాను ఆత్మహత్య చేసుకుంది. విజ్ఞలత ఆత్మహత్య చేసుకునే ముందు తన భర్త రామకృష్ణరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రామకృష్ణరెడ్డి హుటాహుటీన ఇంటికి వచ్చే సరికి కుమార్తె, భార్య వేర్వేరు గదుల్లో ఫ్యాన్‌కు వేలాడుతూ మృతి చెంది ఉన్నారు.
సమాచారం అందుకున్న ఏసీపీ గౌస్ బాబా, ఎస్‌ఐ సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నా కుమార్తె చావుకు అత్తా, మామలే
కారణం: రాంరెడ్డి
శ్రీరాంపూర్‌కు చెందిన పాగాల రాంరెడ్డి, ఆరుణ ల కుమార్తెను మంచిర్యాలకు చెందిన మోహన్‌రెడ్డి, పద్మజల కుమారుడు రామకృష్ణరెడ్డితో 2012న వివాహం చేశారు. ఆ సమయంలో వరకట్నం కింద 15లక్షలు ఇచ్చినప్పటికీ, అదనపు కట్నం తేవాలం టూ అత్త పద్మ, మామా మోహన్‌రెడ్డి, ఆడబిడ్డలు వేధింపులకు గురిచేశారని విజ్ఞలత కుటుంబ సభ్యు లు ఆరోపించారు. గతంలో పంచాయితీలు నిర్వహించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పది రోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి తమ కుమార్తెను వారి ఇంటికి పంపినప్పటి నుండి వేధింపులు అధికమయ్యాయన్నారు.