తెలంగాణ

రౌండ్ ది క్లాక్ మెట్రో పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: నిత్యం ట్రాఫిక్ నరకాన్ని అనుభవించే మహానగరవాసులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు పనులు జోరుగా సాగుతున్నాయి. మొదటి నుంచి పనులు రౌండ్ ది క్లాక్ జరుగుతున్నా, ఈ నెల 28న ప్రధాన చేతుల మీదుగా ప్రారంభించాలనుకున్న మియాపూర్-అమీర్‌పేట, నాగోల్-అమీర్‌పేట కారిడార్లలో పనులు రౌండ్ ది క్లాక్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించే వయోడక్ట్‌లను అమర్చే పనులు రాత్రిపూట ప్రత్యేక ప్రమాద నివారణ చర్యలను అమలు చేస్తూ చేపడుతున్నారు. ఇక మెట్రోస్టేషన్లలో అంతర్గత పనులు, ట్రాక్, సిగ్నలింగ్, విద్యుత్ సరఫరా, కమ్యూకేషన్ వంటి పనులను పగటి పూట చేపడుతున్నారు. ఈ నెల 28న ప్రదాని చేతుల మీదుగా ప్రారంభించాలనుకున్న కారిడార్‌లోనే గాక, కారిడార్ 1లోని ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఎం.జె.మార్కెట్ జాంబాగ్ ప్రాంతా ల్లో కూడా రాత్రి పూట పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు అమర్చాల్సిన వయోడక్ట్‌ను రెండురోజుల క్రితం ఉప్పల్ యార్డునుంచి ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఆలస్యంతో పనులను నిలిపివేసి, వాహనంపై వయోడక్ట్‌ను పక్కనబెట్టా రు. బేగంపేట, అమీర్‌పేట స్టేషన్లలో పనులు జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే గతంలోనే ప్రారంభోత్సవానికి సిద్దమైన నాగోల్ నుంచి మెట్టుగూడ కారిడార్‌లోని ఉప్పల్, హబ్సిగూడ, మెట్టుగూడ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు కల్పించిన లిఫ్టు, ఎస్కలేటర్, ఆటోమెటిక్ ఫెయిర్ యంత్రాలతో పాటు ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన సిసి కమెరాలు, స్థానిక పోలీస్‌స్టేషన్లకు వాటి అనుసంధానం వంటి ప్రక్రియలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. నాగోల్ నుంచి మెట్టుగూడ, అలాగే మియాపూర్ నుంచి ఎస్‌ఆర్‌నగర్ వరకు మెట్రోరైలు పరుగు కోసం ఇప్పటికే కమిషనర్ ఆఫ్ మెట్రోరైలు సేఫ్టీ(సిఎంఆర్‌ఎస్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే! కాగా, ఎస్‌ఆర్‌నగర్ వరకు, కారిడార్ 3 మెట్టుగూడ నుంచి బేగంపేట వరకు పొడిగించటంతో ఈ పొడిగించిన కారిడార్‌కు కూడా సిఎంఆర్‌ఎస్ అనుమతులు రావల్సి ఉన్నాయి. పొడిగించిన ఈ రెండు కారిడార్లలో త్వరలోనే మరికొన్నిసార్లు ట్రయల్ రన్‌లు నిర్వహించి, సేఫ్టీ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ప్రదాని నరేంద్రమోది కార్యాలయం నుంచి ప్రారంభోత్సవం ఖరారయ్యే అవకాశముంది.