తెలంగాణ

ఐదు లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు: తుమ్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మహిళా శిశు సంక్షేమమంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. బుధవారం నాడు శాసనసభలో ఎన్ వి వి ఎస్ ప్రభాకర్, జి కిషన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, రాష్ట్రంలో ఐదు లక్షల మంది దివ్యాంగులకు నెలకు 1500 రూపాయిలు చొప్పున పింఛను చెల్లిస్తున్నామని అన్నారు. పింఛన్లతో పాటు అర్హులైన వారికి స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తున్నామని చెప్పారు. స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని అన్నారు. కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లను 3 శాతం నుండి 4 శాతానికి పెంచే విషయం పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరిలోగా దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను తప్పకుండా భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. వరంగల్‌లోని ఫాతిమానగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. శాసనసభలో దాస్యం వినయ్ భాస్కర్, కొండా సురేఖ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం 79 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిని 2019లోగా పూర్తి చేస్తామని చెప్పారు. నెల రోజుల్లోపు భూసేకరణ పూర్తి చేస్తామని అన్నారు. ఇటీవల రైల్వే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారని, ఇతర డిపార్టుమెంట్స్ కూడా పరిశీలించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అన్నారు.