తెలంగాణ

35.30 లక్షల మంది రైతులకు రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో రైతాంగానికి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేసినట్టు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. శాసనసభలో బుధవారం నాడు డికె అరుణ, తాటిపర్తి జీవన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, వడ్డీ సహా లక్ష రూపాయిలు లోపు అన్ని రుణాలను మాఫీ చేశామని అన్నారు. లక్ష దాటి వడ్డీ ఉంటే దానిని వారు చెల్లించుకోవాలని అన్నారు. లక్షలోపు అప్పు ఉన్న వారికి 16,124.30 కోట్లు నాలుగు విడతల్లో మాఫీ చేశామని అన్నారు. ఒక్క రూపాయి కూడా ఎవరికీ బాకీ లేమని మంత్రి ఉద్ఘాటించారు. 35 లక్షల 30 వేల మంది రైతులకు దీని వల్ల రుణ మాఫీ జరిగిందని అన్నారు. అసలు రుణం కోసం 13,414 కోట్లు, వడ్డీ కోసం 2710 కోట్లు విడుదల చేశామని ఆయన వివరించారు. లక్ష వరకూ అప్పు ఉన్న వారిందరికీ అప్పు తీర్చేశామని, రుణ మాఫీలో సర్కార్ విఫలమైందన్న ప్రతిపక్షాల వాదన సరికాదని , వారి ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. రైతుల ఉపకరణాలకు 702 కోట్లు విడుదల చేశామని దానివల్ల 25 లక్షల మంది రైతులకు ఉపశమనం కలుగుతుందని అన్నారు.
నాయి బ్రాహ్మణులకు క్షౌరశాలలు
నాయి బ్రాహ్మణులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన క్షౌరశాలలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోందని బిసి అభివృద్ధి మంత్రి జోగు రామన్న చెప్పారు. ప్రశ్నోత్తర కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ 100 శాతం సబ్సిడీతో ఈ క్షౌరశాలలు ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు. నాయి బ్రాహ్మణుల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో 250 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.