తెలంగాణ

తెలంగాణ-్ఢల్లీ మధ్య పరస్పర సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్న ఇంక్యూబేటర్‌కు అవసరమైన సహకారం అందిస్తామని ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. ఢిల్లీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆదర్శ విధానాలు, పాలసీలు, పథకాలపైన పరస్పర సహాకారం ఇచ్చిపుచ్చుకుంటామన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోతున్న ఇంక్యూబేటర్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన టి-హబ్‌ను సిసోడియా సందర్శించారు. ఈ సందర్భంగా సిసోడియా అసెంబ్లీకి వచ్చి మంత్రి కెటిఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఐటీ, ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ అద్బుతంగా పని చేస్తుందని సిసోడియా కొనియాడారు. ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ ఏర్పాటు అనుభవాలను కెటిఆర్ ఆయనతో పంచుకున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన టి హబ్‌ను తెలంగాణ వరకే పరిమితం చేయకుండా దేశంలో ఎవరైనా భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కల్పించామన్నారు. టి హబ్ తమకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందని, హైదరాబాద్‌లో స్టార్టప్ కల్చర్ బాగా పెరిగిందని, యువత ఆశలకు గొప్ప అలంబన లభించిందని మంత్రి కెటిఆర్ వివరించారు. ఢిల్లీలో ఏర్పాటు చేయబోయే ఇంక్యూబేటర్‌లో ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమ వర్గాలను భాగస్వామ్యం చేయాలని కెటిఆర్ సూచించారు. తమ రాష్ట్రం ఇప్పటికే గోవా, ఒడిస్సా రాష్ట్రాలతో ఐటీ రంగంలో అభివృద్ధికి నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటున్నట్టు కెటిఆర్ వివరించారు.