తెలంగాణ

కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో ఒప్పంద అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మలిపెద్ది సుధీర్‌రెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు బుధవారం నాడు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ, ఒప్పంద జూనియర్ అధ్యాపకులకు నెలకు 18వేలు ఉండగా దానిని 37,100 రూపాయిలకు పెంచామని, దానివల్ల 3687 మంది లబ్దిం పొందారని, ఫలితంగా ప్రభుత్వంపై 37.24 కోట్లు ఆర్ధిక భారం పడిందని అన్నారు. అలాగే ఒప్పంద డిగ్రీ అధ్యాపకులకు 20,700 నుండి 40,270 రూపాయిలకు పారితోషికం పెంచామని, ఈ ప్రయోజనం 889 మందికి లబ్ది చేకూరుతుందని, ఫలితంగా ప్రభుత్వంపై ఏటా 8.20 కోట్ల భారం పడుతుందని అన్నారు. ఒప్పంద పాలిటెక్నిక్ అధ్యాపకులు వేతనం నెలకు ఒక్కంటికీ 19వేల నుండి 40,270 రూపాయిలుకు పెంచామని, 435 మంది అధ్యాపకులకు మేలు చేకూరుతుందని ఫలితంగా ప్రభుత్వంపై 5.12 కోట్ల రూపాయిలు భారం పడుతుందని పేర్కొన్నారు. మొత్తం మీద 5011 మంది ఒప్పంద అధ్యాపకులకు పారితోషికం పెరిగిందని, దీనివల్ల ప్రభుత్వంపై 50.56 కోట్ల భారం పడిందని చెప్పారు. ఒప్పంద కార్మికుల సర్వీసులను క్రమబద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు 2016 ఫిబ్రవరి 26న జీవో 16ను జారీ చేసిందని, అయితే హైకోర్టు ఈ జీవోను కొట్టివేసిందని, వారి సర్వీసులను ఏ రకంగా క్రమబద్ధం చేయాలనేది ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. అన్ని శాఖల్లో ఒప్పంద కార్మికుల సర్వీసులను క్రమబద్ధం చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పడే ఖాళీల్లోనూ, కొత్తరిక్రూట్‌మెంట్‌ల ద్వారా తీసుకుంటామే తప్ప ఒప్పంద కార్మికులను ఇబ్బంది పెట్టబోమని అన్నారు.