తెలంగాణ

140 కోట్లతో కొత్త ఏసీ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: రానున్న రోజుల్లో బస్టాండ్‌లలో 105 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసే యోచన ఉన్నట్టు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. బుధవారం నాడు శాసనసభలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, వి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ 140 కోట్లతో ఈ ఏడాది కొత్త ఎసి బస్సులు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. 31 బస్టాండ్‌లలో మినీ థియేటర్లు ఏర్పాటు చేస్తామని దీనివల్ల ఆర్టీసీకి 4 కోట్ల రూపాయిల మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో రవాణా సంస్థను పటిష్టం చేస్తామని తెలిపారు. ప్రైవేటు వాహనాల నియంత్రణకు ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటునే ఉన్నామని అన్నారు. ఖమ్మం బస్టాండ్ నిర్మించడానికి టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని అన్నారు. ప్రజా ప్రతినిధులు అంతా నెలకోసారి బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. 2015-16 సంవత్సరానికి హైదరాబాద్ మహానగర మన్సిపల్ కార్పొరేషన్ ఆర్టీసీకి 336.40 కోట్లు విడుదల చేసిందని చెప్పారు.
ఆర్టీసీ సవరించిన వేతన సేళ్ల భారాన్ని తగ్గించడానికి ఆర్టీసీకి 428.08 కోట్ల రూపాయిలు విడుదలచేసిందని అన్నారు. ప్రభుత్వ పూచీ కింద 500 కోట్ల రూపాయిల మేర రాయితీల మిగులును ప్రభుత్వం విడుదల చేయడం వల్ల నిర్వహణ మూలధన కొరతను తగ్గించిందని అన్నారు. ప్రభుత్వ పూచీ రుణ రూపంలో 350 కోట్ల మేర రాయితీలను కూడా విడుదల చేసిందని చెప్పారు. ప్రయాణీకుని మెరుగైన సంతృప్తి కోసం హయ్యర్ ఎండ్ బస్సుల పునస్థాపనకు 140 కోట్ల మొత్తాన్ని సమకూర్చి 35 కోట్లు విడుదల చేసిందని అన్నారు. పాతబస్సుల పున:స్థాపన, ప్రస్తుత మార్గాల్లో బస్సుల పెంపు, తెలంగాణ, ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, చత్తీస్‌ఘడ్ తదితర ప్రాంతాలకు కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నామని అన్నారు. 22 గరుడ ప్లస్, 11 గరుడ, 107 రాజధాని ఎసి, 448 సూపర్‌లగ్జరీ, 47 డీలక్స్, 414 ఎక్స్‌ప్రెస్, 97 పల్లెవెలుగు, 117 జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం బస్సులు ప్రవేశపెట్టామని అన్నారు.
వాటితో పాటు 60 మిని ఎసి వజ్రా, 50 మిని నాన్ ఎసి బస్సులు, 80 మెట్రో లగ్జరీ ఎసి బస్సులు, నాలుగు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 45 డీలక్స్ మెట్రో బస్సులు, ఐదు సిటీ ఆర్డినరీ బస్సులను ప్రవేశపెట్టామని తెలిపారు. 2016-17 ప్రణాళికలో సేకరించిన మిగిలిన 197 నూతన బస్సులను మూడు నెలల్లో వినియోగిస్తామని చెప్పారు. 2017-18 సంవత్సరానికి వివిధ రకాల బస్సులు 1175 సేకరించాలని ప్రతిపాదించినట్టు ఆయన తెలిపారు.