తెలంగాణ

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: ఫీజు రియింబర్స్‌మెంట్ సకాలం లో చెల్లించకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకున్న ఉదంతాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసాయి. కేవలం ప్రభు త్వం ఇచ్చే ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బులను కొల్లగొట్టడానికే ప్రైవేట్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తే వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటే అక్కసు ఎందుకని విపక్షాలపై పాలకపక్షం ఎదురుదాడి చేసింది. శాసనసభలో బుధవారం ఫీజు రియింబర్స్‌మెంట్ అం శంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 14లక్షల మంది విద్యార్థులు వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తున్నారన్నారు. వీరికి సంబంధించిన ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ కాలేజీల యాజమన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా, సర్ట్ఫికెట్స్ ఇవ్వకుండా వేదింపులకు గురి చేయడాన్ని తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయని ఆరోపించారు. ఒక విద్యార్థులకు మాత్రమే కాకుండా వేలాది మంది నిరుద్యోగు లు ప్రైవేట్ కాలేజీలలో ఉద్యోగాలు చేస్తుండగా ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా వేతనాలు పొం దడం లేదని సంపత్ అన్నారు. సభ్యుని ఆరోపణపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయ త్నం చేయవద్దన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపునకు రెండు మూడు నెలలు పడితే పట్టవచ్చన్నారు. ప్రభు త్వం నయా పైసా ఇవ్వడం లేదని సభ్యుడు ఆరోపించడం సరికాదన్నారు. ఒకవేళ ఇవ్వకుంటే ఆ కాలేజీలు ఎలా పని చేస్తున్నాయని మంత్రి ప్రశ్నించారు. మూడు, నాలు గు నెలలు కాదు ఐదారు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని సం పత్‌కుమార్ గుర్తు చేసారు. టిఆర్‌ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ, కేవలం ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బుల కోసమే కొన్ని కాలేజీలు కోళ్లఫారమ్‌లు, గోదాంలలో ఏర్పాటు చేసారన్నారు. అలాంటి కాలేజీలపై తనఖీలు నిర్వహించడం తప్పా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాం లో ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా గాలికి వదిలేసి వెళ్తే తమ ప్రభుత్వం వచ్చాక వాటిని క్లియర్ చేసిందని గుర్తు చేసారు. ఫీజు రియింబర్స్‌మెం ట్ బకాయిల వల్ల ఏదైనా కాలేజీలో విద్యార్థులను బయటికి పంపించిన ఉదంతాలు ఉన్నా యా? అని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను మొత్తాన్ని క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించి కూడా మాట నిలబెట్టుకోకపోవడం తో ప్రివిలేజ్ నోటిసు ఇచ్చామని సంపత్‌కుమార్ అన్నారు. మంత్రి ఈటల స్పందిస్తూ ముఖ్యమంత్రికి నోటిసు ఇచ్చామనడం కుసంస్కారమన్నారు. ప్రివిలేజు నోటిసు ఇవ్వడం ఎలా తప్పు అవుతుందని సంపత్‌కుమార్ ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక మంత్రులు తనకు అడ్డుపడుతున్నారని సంపత్ ధ్వజమెత్తారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ ‘సంపత్‌కు అంత సీన్ లేదు’ అని వ్యాఖ్యానించారు.