తెలంగాణ

అసెంబ్లీ నుండి కాంగ్రెస్ వాకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: దళిత విద్యార్థులకోసం నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో వౌలిక సదుపాయాలు లేవని, నల్లగొండ జిల్లాలో స్నానానికి చెరువుకు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు మరణించారని, వౌలికసదుపాయాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ శాసనసభ నుండి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల ఏర్పాటు అంశంపై గురువారం జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం దళిత విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ పక్షం ఉపనాయకుడు టి. జీవన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి, తోటిసభ్యులతో కలిసి ఆయన సభ నుండి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల మంత్రి టి. హరీష్‌రావు, దళిత సంక్షేమ మంత్రి జగదీష్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, కాంగ్రెస్ హయాంలో దళిత విద్యార్థుల వసతి సౌకర్యాలకోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి, కాంగ్రెస్ వాకౌట్ చేసిందని విమర్శించారు. గత మూడేళ్లలో 500 రెసిడెన్షియల్ స్కూళ్లు/కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. 2022 నాటికి ప్రతి గురుకుల విద్యాసంస్థకు సొంత భవనం ఏర్పాటు చేస్తామని, దేశానికి ఆదర్శంగా నిలుస్తామని వెల్లడించారు. త్వరలోనే సంక్షేమ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.