తెలంగాణ

గదికి 20 మంది విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ఒక్కో గదిలో ఇరవేసి మంది విద్యార్థులు, ఒకటే బాత్‌రూమ్, ఒకటే ఫ్యాన్ ఇదేనా బంగారు తెలంగాణ అంటే అని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏర్పాటు చేసిన గురుకుల విద్యాసంస్థల్లో కనీసం ఒక్కదానికైనా పక్కా భవనాన్ని ఏర్పాటు చేసిందా? రెగ్యులర్ ఉద్యోగులను నియమించిందా? ఇదేనా ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే బంగారు తెలంగాణ అని కోమటిరెడ్డి నిలదీసారు. శాసనసభలో గురువారం గురుకుల పాఠశాలలు, కళాశాలపై జరిగిన లఘు చర్చలో కాంగ్రెస్ పక్షం నుంచి కోమటిరెడ్డి మాట్లాడుతూ, గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లు ఏ దుస్థితిలో ఉన్నాయో చుద్దాం రండి, రావడానికి సిద్దమైనా అని ప్రశ్నించారు. ప్రతీ దానికి బంగారు తెలంగాణ...బంగారు తెలంగాణ అంటారు, బంగారు తెలంగాణ అంటే ఏమిటీ నాకైతే అర్థం కావటం లేదన్నారు. అదో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందని ఏద్దేవా చేసారు. గురుకుల విద్యాలయాల్లో పనిచేసే 738 మంది కాంట్రాక్టు ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయమని ఆందోళన చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్క గదిలో 20-30 మంది విద్యార్థినీలు ఎలా ఉంటారు, అందరికీ కలిపి ఒకే బాత్‌రూమ్ ఉంటే ఎలా ఉండగలుగుతారు? కంపుగొడుతున్నాయని ఆరోపించారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పాలకపక్ష సభ్యులు అభ్యంతరం తెలపగా ‘నేను చెప్పే దాంట్లో అనుమానం ఏమైనా ఉందా? రండి నా వెంట వస్తే చూపిస్తా’ అని సవాల్ చేసారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బాత్‌రూమ్‌లు లేక చెట్ల కింద స్నానాలు చేస్తున్నారు, వారి హాస్టల్ గదులు కంపుగొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. వాస్తవాలను తెలుసుకోకుండా విమర్శకు ప్రతివిమర్శ చేయటం మానుకోవాలన్నారు. గురుకుల ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు, చేయటానికి ఇబ్బంది ఏమిటనీ ప్రశ్నించారు. ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కొత్త సచివాలయం కడుతామంటున్నారు, అవ్వే డబ్బులు ఖర్చు చేస్తే హాస్టళ్లు బాగుపడవా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఏమన్నా అంటే మీ హయాంలో ఏమి చేసారని ప్రశ్నిస్తున్నారు. మా హయాంలో చేయలేదని ఒప్పుకుంటున్నాను, మీరైనా చేయాలని అడుగుతున్నా అన్నారు. మా హయాంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు డబ్బులు ఇవ్వను అన్నందుకే మంత్రి పదవీకి రాజీనామా చేసానని కోమటిరెడ్డి గుర్తు చేసారు.
బిజెపి సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. ఐదేళ్లలో 15 వందల గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు, మరీ మూడేళ్లలో 250 ఏర్పాటు చేస్తే మిగతావి ఏడాదిన్నరలో ఎలా ఏర్పాటు చేస్తారని చింతల ప్రశ్నించారు. రెగ్యులర్ సిబ్బంది లేకుండా, పక్కా భవనాలు లేకుండా గురుకుల విద్యాలయాల నుంచి మంచి ఫలితాలు ఎలా వస్తాయని ఎంఐఎం సభ్యుడు బలాల, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ప్రశ్నించారు.