తెలంగాణ

90% ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు చక్కగా పని చేస్తున్నాయని, 90 శాతానికిపైగా ఉత్తీర్ణతతో పాటు సుప్రసిద్ధ విద్యా సంస్థల్లో సీట్లు పొందడంతో పాటు మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారని మంత్రి జి జగదీశ్‌రెడ్డి చెప్పారు. శాసనసభలో గురువారం గురుకుల పాఠశాలలు, కళాశాలపై జరిగిన లఘు చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ, రాష్ట్రంలో విద్యాసంస్థల్లో సగటు ఉత్తీర్ణత కంటే గురుకుల విద్యాలయాల్లో 15 శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదు అవుతుందన్నారు. గత విద్యా సంవత్సరం 2016-17లో గురుకుల విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్న 325 మంది విద్యార్థుల్లో 60 మంది ఐఐటీలో, ఎన్‌ఐఐటీలో 174 మంది, ట్రిపుల్ ఐటీలో నలుగురు, వైద్య రంగంలో 87 మంది ప్రవేశాన్ని సీట్లు సంపాదించారని మంత్రి వివరించారు. అలాగే 154 మంది విద్యార్థులు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్, నల్సార్, క్లాట్, సిపిడిసిఏ వంటి అనేక పేరుగాంచిన విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించారన్నారు.
గురుకుల విద్యార్థులు ఒక చదువులోనే కాకుండా క్రీడలు, యోగా, క్రికెట్, అథ్లటిక్స్‌లలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. ఎవరెస్టు శిఖరం, రీనాక్ శిఖరం, కిలి మంజారో శిఖరాల వంటి ప్రపంచంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారని మంత్రి గుర్తు చేసారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో గురుకుల విద్యాలయాలు 296 ఉంటే తాము అధికారంలోకి వచ్చాక కేజి టు పీజీ మిషన్‌లో భాగంగా కొత్తగా 493 ఏర్పాటు చేసామన్నారు.
ఇందులో సాంఘీక సంక్షేమశాఖ పరిధిలో 104, గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 53, బీసీ సంక్షేమశాఖ పరిధిలో 142, మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలో 194 గురుకుల పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేసామన్నారు. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య 2,81,379 కాగా ఇది 2021 సంవత్సరం నాటికి 8.3 లక్షలకు చేరుకుంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన 546 గురుకుల విద్యాసంస్థలపై వచ్చే ఐదేళ్లలో రూ.17,347 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామన్నారు.