తెలంగాణ

మార్చిలోగా లక్ష ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని నీరుపారుదల మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఎత్తిపోతల పథకం పనులపై ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం కింద మునుగోడులో 10,270, నల్లగొండలో 24465, నకిరేకల్‌లో 62,476, తుంగతుర్తిలో 2784 ఎకరాలకు సాగునీరు అందుతోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పథకం పనులు నిర్లక్ష్యంగా జరిగాయని అన్నారు. ప్రాజెక్టు కోసం 2130 ఎకరాలు సేకరించాల్సి ఉందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఉదయ్ సముద్రం ఎత్తిపోతల పనులకు సంబంధించి పంప్‌హౌస్, టన్నళ్లు, సర్జ్‌పూల్ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. పంపిణీ కాలువల కోసం భూసేకరణలో జాప్యం జరిగిందని, అవసరమైన 3248 ఎకరాలకు గానూ ఇంకా ఈ ప్రాజెక్టులో 2130 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని మంత్రి వివరించారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు సాధించడానికి గానూ రాష్ట్రంలో గిరిజన యువతీ , యువకులకు శిక్షణ ఇవ్వడానికి సివిల్ సర్వీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. 2017 సెప్టెంబర్ 21న జీవో 459 ద్వారా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వైటిసి భవనం వద్ద ఎస్‌టిలకు ఐఎఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశామని అన్నారు. 2017-18 సంవత్సరానికి గానూ శిక్షణ కేంద్రంలో 100 మంది అబ్బాయిలకు, 50 మంది అమ్మాయిలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని, ఇంత వరకూ అందులో 75 మంది అబ్బాయిలు, 44 మంది అమ్మాయిలు శిక్షణకు చేరారని అన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కలిపి 9 నెలల శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో షి టీమ్స్ చురుకుగా పనిచేస్తున్నాయని హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి చెప్పారు. 2017 సెప్టెంబర్ నాటికి 210 షి టీమ్స్ పనిచేస్తున్నాయని అన్నారు.సెప్టెంబర్ వరకూ 4972 కేసులను రిజిస్టర్ చేశామని అన్నారు. 4620 మందిని అరెస్టు చేశామని , 9743 మందికి కౌనె్సలింగ్ ఇచ్చామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుతో డిండి ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని అనుసంథానం చేయడం ద్వారా నర్లాపూర్ రిజర్వాయిర్ నుండి నీటిని విడుదల చేయాలని ప్రతిపాదించినట్టు సాగునీటి మంత్రి హరీష్‌రావు చెదప్పారు.